కొరటాల శివ సినిమాల్లో హీరో ఆ రంగు షర్ట్ ఎందుకు వేసుకుంటాడో తెలుసా?

మామూలుగా అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. ఇది సహజమే… అదే విధంగా కొందరు సెంటిమెంట్ ను బాగా నమ్ముతుంటారు. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టే సమయంలో ఇలా చేస్తే ఈ పని సక్సెస్ అవుతుంది.. లేదా ఈ పని గురించి మొదటిగా ఎవరికైనా చెబితే సక్సెస్ అవుతుంది. ఈ విధంగా వివిధ రకాల సెంటిమెంట్ లను అనుసరిస్తూ ఉంటారు. అయితే వీరికి ఆ సెంటిమెంట్ పై అంత గురి ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీ లోనూ డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు ఇలా ఎవరైనా కూడా ఇదే రకమైన కొన్ని సెంటిమెంట్ లను ఫాలో అవ్వడం మీరు గమనించి ఉండక పోవచ్చు. కానీ ఖచ్చితంగా కొందరు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యే డైరెక్టర్ గురించి మరియు ఆయన ఏ విషయాన్ని సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నారు అన్న దాని గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం హిట్ సినిమాలను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ లలో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ.. రచయిత నుండి డైరెక్టర్ గా ఎదిగిన తీరు ఎందరో కుర్ర డైరెక్టర్ లకు స్ఫూర్తి అని చెప్పాలి. ఈయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తీసింది కొన్ని చిత్రాలే అయినా టాలీవుడ్ టాప్ హీరోస్ తో పనిచేసి తన సత్తా ఏమిటో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే కొరటాల శివ కూడా తన సినిమాలలో ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యాడట. కానీ ఇది అందరూ గమనించక పోయి ఉండే అవకాశం లేకపోలేదు.

ఇప్పటి వరకు కొరటాల తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా సమాజంలో ఉండే ప్రజలకు ఏదో ఒక విలువ, నీతి మరియు బాధ్యతను తెలియ చేసినవే కావడం కూడా కొరటాల సినిమాలు హిట్ కావడానికి ఒక కారణం. ఇది మాత్రమే కాకుండా తన సినిమాలలో క్లైమాక్స్ లో హీరోలు ధరించే షర్ట్ విషయంలో సెంటిమెంట్ ఉందట. సాధారణంగా కొరటాల శివకి బ్రౌన్ కలర్ అంటే చాలా ఇష్టమట. అందుకే సినిమాకు ఎంతో కీలకం అయిన క్లైమాక్స్ లో హీరోకు బ్రౌన్ కలర్ షర్ట్ వేస్తే సినిమా హిట్ అవుతుందని ఒక భారీ నమ్మకం. అందుకే తన మొదటి సినిమా మిర్చి నుండి రేపు రిలీజ్ కాబోతున్న ఆచార్య వరకు అన్ని సినిమాలలోనూ క్లైమాక్స్ లో హీరోకు బ్రౌన్ కలర్ షర్ట్ ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నీ కూడా హిట్ అయ్యాయి… మరి చిరంజీవి రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఆచార్య చిత్రం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే.