పాపం స‌ర్కారు దెబ్బ‌తో ఓ మంచి సినిమా ఎగిరిపోయింది…!

ఇటీవ‌ల కాలంలో క్లీన్ హిట్ అయిన సినిమాల వ‌రుస‌లో విశ్వ‌క్‌సేన్ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా నిలుస్తుంది. విశ్వ‌క్‌సేన్ త‌న ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా టీవీ 9 దేవితో విశ్వ‌క్‌సేన్ వివాదం రావడంతో ఈ సినిమాకు సోష‌ల్ మీడియాలో కూడా మాంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది.

తొలి రోజు వ‌సూల్లు కూడా బాగానే ఉన్నాయి. అయితే వారం రోజుల‌కే ఈ సినిమా చాప చుట్టేసింది కార‌ణం స‌ర్కారు వారి పాట‌. మాంచి అప్లాజ్ వ‌చ్చినా వ‌సూళ్లు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిన్న ఈ సినిమా చాలా థియేట‌ర్ల నుంచి త‌ప్పించేశారు. సర్కారువారి పాట సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నింటినీ ఇచ్చేశారు.

అతిక‌ష్టం మీద మాత్ర‌మే కొన్ని థియేట‌ర్ల‌లో ఆచార్య‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక కేజీయ‌ఫ్ 2 ఇప్ప‌ట‌కీ స్ట్రాంగ్ గా ఉన్నందున ఆ సినిమా మాత్రం కొన్ని థియేట‌ర్ల‌ను అట్టిపెట్టుకుంది. మ‌ధ్య‌లో విశ్వ‌క్‌సేన్ బ‌లైపోయాడు. పైగా పెద్ద సినిమాల్లాగా విశ్వ‌క్‌సేన్ సినిమాకు టిక్కెట్ రేట్లు కూడా పెంచలేదు. స‌ర్కారు వారి పాట బాక్సాఫీస్‌ను క‌మ్మేయడంతో అశోక‌వ‌నం మ‌స‌క‌బారిపోయింది.

మ‌రో వారం రోజులు నిల‌బ‌డి ఉంటే ఈ సినిమాకు మాంచి వ‌సూల్లు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కొన్ని చోట్ల ఈ సినిమాకు.. ముఖ్యంగా మ‌ల్టీఫ్లెక్స్‌లు, ఏ సెంట‌ర్లలో ఈ సినిమా న‌డుస్తున్నా ఆశించిన మేర వ‌సూల్లు రాక‌పోవ‌చ్చు.