అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు యాష్..హ్యాట్సాఫ్ హీరోస్..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వస్తున్న అలవాటు ఒకటి ఉంది. అదే, యాడ్స్ ప్రమోటింగ్. సినిమాలు చేసే హీరో హీరోయిన్లు.. డబ్బుల కోసం..పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తారు. పాపులారిటీకి పాపులర్..డబ్బు పాటికి డబ్బు.. కేవలం రెండి నిమిషాల యాడ్ కోసం కోట్లు ఇస్తుంటే ఎవ్వరు వద్దంటారు చెప్పండి. అందుకే చాలా మంది హీరో , హీరోయిన్లు వచ్చిన అవకాశాలని వదులుకోకుండా..ఉపయోగించుకుంటుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు లిమిట్స్ క్రాస్ చేసి మరీ చెత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. కొందరు అయితే కండోమ్‌స్ ని ఎలా వాడాలి అంటూ కూడా చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అభిమానులు సైతం మడిపడుతున్నారు.

కాగా, ఈ మధ్యనే హీరో అల్లు అర్జున్ ఓ పొగాకు బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఏకంగా 5 కోట్ల ఆఫర్ వచ్చిందని..కానీ బన్నీ అలాంటి జనాలను పట్టి పీడించే ప్రాడెక్ట్స్ ని ప్రమోట్ చేయనంటూ..భారీ డీల్ ని వద్దు అనుకున్నాడని వార్తలు వచ్చాయి. నిజానికి 2 నిమిషాల యాడ్ కు 5 కోట్లు ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో పాపులారిటీ ఉంటే కానీ ఇవ్వరు. కానీ బన్నీ నాకు జనాల బాగోగులే ముఖ్యం అంటూ ఆ ఆఫర్ ని వదిలేసుకున్నాడు. దీంతో అభిమానులు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. శభాష్ బన్నీ అంటూ మెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు అలాంటి కోట్లు ఇచ్చే ఆఫర్ ను వదిలేసుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ రాఖీ బాయ్..అదేనండి యాష్. రీసెంట్ గా KGF2 తో బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాసిన ఈ హీరో కి ఓ పాపులర్ పొగాకు బ్రాండ్ ప్రమోట్ చేయడానికి బిగ్ అమౌంట్ ఇస్తాం అన్నారట. ఇంచు మించు 5 కోట్లు ఆఫర్ అయ్యిన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ యాష్ కూడా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రాడెక్ట్స్..ను ఎప్పటికి ప్రమోట్ చేయను అంటూ యాష్ తేల్చి చెప్పారట. దీంతో కెజియఫ్ స్టార్ ఫాలోవ‌ర్లు, అభిమానులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా యష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

kgf2
kgf2