కాజల్ కఠిన నిర్ణయం..కొంప ముంచేసిందిగా..?

గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఓ వార్త యమ ట్రెండింగ్ గా వైరల్ అవుతుంది. అదే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్..ఇక పై సినిమాలు చేయదట. పూర్తి గా సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. బిడ్డను చూసుకోవాలని అనుకుంటుందట. ఇదే న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే తన చిన్న నాటి స్నేహితుడు..గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్..ఈ మధ్యనే ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి..మాతృత్త్వాని ఎంజాయ్ చేస్తుంది. ఆమె బిడ్డకు సంబంధించిన ఫోటోలు బయటకి రాకుండా జాగ్రత్త పదుతూ.. కంటికి రెప్పల కాపాడుకుంటుంది.

అయితే, తాజా గా ఆమెకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. తన అంద చందాలతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన కాజల్ ఇక పై సినిమాలు చేయనంటూ చెప్పేసిందట. ప్రజెంట్ కాజల్ సినిమాలు చేయలేదు..డెలివరి అయ్యి ఒక్క నెల కూడా కాలేదు..ఆమె కు ఖచ్చితంగా ఆరు నుండి సంవత్సరం పాటు రెస్ట్ అవసరం. ఈ క్రమంలోనే కాజల్ కు ఓ స్టార్ డైరెక్టర్ అమ్మ ఇంపార్ టెన్స్ తెలిపే స్టోరిని ఒకటి రెడీ చేసి కాజల్ కి వినిపించాడానికి వెళ్లితే.. కాజల్.. బాగా ..సారీ నేను చేయలేను అన్నారట.

ఆ డైరెక్టర్ మీరు ఎప్పుడంటే అప్పుడే తీద్దాం మేడమ్.. వన్ ఇయర్ అయిన పర్లేదు అన్నా కూడా కాజల్ నో నో ..ఇక పై నేను నా పూర్తి జీవితం నా బిడ్డకే అంకితం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు హీరోయిన్ గా నా కల ను నెరవేర్చుకున్నాను..ఇక పై ఓ తల్లి గా నా బాధ్యతలు నెరవేరుస్తా” ప్లీజ్ ..అర్ధం చేసుకోండి అంటూ కాజల్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అనే విషయం బయటపడింది. ఈ వార్త తో కాజల్ అభిమానులను బాధ పెట్టిన..కానీ తాను తీసుకున్న డెసీషన్ మంచిదే… హ్యాట్సాఫ్ కాజల్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఒక్క వేళ్ళ ఇదే న్యూస్ నిజమైతే..ఇక పై మనం కాజల్ ని తెర పై చూడలేము అనమాట.