స్టార్ జంటలు తమ పిల్లలకు పేర్లు పెట్టడంలో ఫాలో అయినా లాజిక్ ఇదే?

పిల్లలకు పేరు పెట్టడం అంటే అదో మధురమైన ఘట్టం. ఒకప్పుడు అయితే తాత, అమ్మమ్మ, నాన్నమ్మ పేర్లు కలిసొచ్చేలా లేదా నేరుగా వారి పేర్లనే తమ పిల్లలకు పెట్టుకునే వారు. అప్పట్లో పేరు ఎలా ఉండేవి అంటే వీర వెంకట రమణ సత్యనారాయణ గోవిందా….etc అంటూ తిరుమలలో క్యులా ఒక కిలోమీటరు ఉండేవి. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ పేర్లు పెట్టే విధానం కూడా మారింది. ఆ తరవాత రాశులు, నక్షత్రాలు చూసి అర్థవంతమైన పేర్లు పెట్టేవారు. కానీ ఇపుడు తమ పిల్లలకు తమ పేర్లు కలిసొచ్చేలా అలాగే అర్థవంతంగా ఉండేలా పేర్లు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అలాగే తమ పిల్లల పేర్లు స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యి తమ పిల్లలకు పేర్లు పెట్టిన సెలబ్రిటీ జంటలు ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం.

ముందుగా చెప్పాలంటే…. రెండు రోజుల క్రితం మంగళవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడే తమ బిడ్డకు పేరు కూడా పెట్టేసి అభిమానులకు చెప్పేసింది ఈ జంట. కాజల్, గౌతమ్ కిచ్లు పేర్లు కలిసొచ్చేలా తమ తనయుడికి నీల్ కిచ్లు అని పేరు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ తమ బిడ్డను ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఫ్యాన్స్ కూడా పేరు చాలా బాగుంది అంటు ఫుల్ ఖుషీగా స్పందిస్తున్నారు.

బాలీవుడ్ స్వప్న సుందరి ఐశ్వర్యరాయ్ , హీరో అభిషేక్ బచ్చన్ ల గారాల కూతురు ఆరాధ్య పేరు కూడా వీరిద్దరి పేర్లు కలిసొచ్చేలా పెట్టుకున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డిల ముద్దుల కూతురు అర్హ పేరు కూడా సింగిల్ వర్డ్ లో అలాగే ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పెట్టుకున్నారు. చిట్టితల్లి అర్హ వీడియోలు , పిక్స్ సోషల్ మీడియాలో ఎపుడు హాట్ టాపిక్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే.

వైవిధ్య భరిత నటుడు రానా పేరు కూడా తన తాతగారు రామానాయుడు పేరులో నుండి రెండు అక్షరాల్ని తీసుకుని పెట్టారు.

అలాగే పవర్ స్టార్ చిన్న కొడుకు, చిన్న కూతురు పేర్లు కూడా చాలా స్పెషల్ గా అలాగే వారి పేర్లు కలిసొచ్చేలా పెట్టుకున్నారు. పవన్ చిన్న కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ (మార్క్ అనగా క్రిష్టియన్ పరంగా మార్స్ దైవం అని అర్దం), శంకర్ అంటే అన్నయ్య అసలు పేరులోంచి తీసుకున్న పేరు, అలాగే పవన్ కళ్యాణ్ లోని పవన్ ను కూడా కలిపి ఇలా పేరు పెట్టారు అన్నమాట. పవన్ చిన్న కుమార్తె పేరు పోలిన అంజనా పవనోవనా- ఈ పేరులో పోలిన అంటే గ్రీకు దైవం అని అర్దం. అంజనా అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు అని తెలిసిందే, పవన్ పేరును కూడా యాడ్ చేసి ఇలా పేరు పెట్టారు.

అక్కినేని ఫ్యామిలీ గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీలోని పిల్లలకు నాగ అనే పేరు యాడ్ చేస్తూ పేరు పెడుతుంటారు. నాగేశ్వర్ గారి తనయుడు నాగార్జున అలాగే ఆయన తనయుడు నాగచైతన్యకు ఇలానే పేర్లు పెట్టారు.

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కుమార్తె పేరు మిషా. షాహిద్ పేరు అలాగే భార్య మీరా పేరు కలిసొచ్చేలా తమ కుమార్తెకు మిషా అని నామకరణం చేశారు.