ఆర్ఆర్ఆర్‌ను టచ్ చేయలేకపోతున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం యావత్ సినీ ఇండస్ట్రీ కేజీఎఫ్ 2 మేనియాతో ఊగిపోతుంది. రాఖీ భాయ్‌గా కన్నడ హీరో యశ్ ఈసారి బాక్సాఫీస్‌ను ఎలా రఫ్ఫాడిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై కన్నడ ఆడియెన్స్ కంటే కూడా తెలుగు ఆడియెన్స్‌లోనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే, ఇది ఇండియావైడ్‌గా ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

కానీ అంత సీన్ లేదని అంటున్నారు ఓవర్సీస్ తెలుగు ఆడియెన్స్. అక్కడ కేజీఎఫ్ 2 తెలుగు వర్షన్‌పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఇప్పటికే అక్కడ ప్రీబుకింగ్స్ ఓపెన్ కాగా, అంతంత మాత్రంగానే సినిమా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తంది. ఆర్ఆర్ఆర్ రికార్డును కేజీఎఫ్ 2 లేపేయడం ఖాయమని అందరూ అంటుంటే, ఓవర్సీస్‌లో మాత్రం కనీసం ఆర్ఆర్ఆర్ ప్రీబుకింగ్స్‌ను కూడా టచ్ చేయలేకపోతోంది ఈ సినిమా.

ఏదేమైనా ఆర్ఆర్ఆర్ రికార్డులకు కేజీఎఫ్ 2 ఎసరు పెడుతుందని కన్నడ మీడియాతో పాటు అందరూ అనుకుంటుంటే, ఓవర్సీస్ తెలుగు ఆడియెన్స్ మాత్రం ఈ సినిమాను ఓ నార్మల్ సినిమాగా భావిస్తూ అక్కడ దీనికి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి నిజంగానే కేజీఎఫ్ 2 ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలుకొడుతుందా లేక దాన్ని టచ్ చేయలేక చేతులు ఎత్తేస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.