మెగా అభిమానులకు బిగ్ షాక్: భర్తను విడిచి పుట్టింటికి వచ్చేసిన నీహారిక.. కన్నీరుపెట్టుకున్న నాగబాబు..?

మనకు తెలిసిందే నాగబాబు ముద్దుల కూతురు మెగాడాటర్ నీహారిక ..ఆదివారం జరిగిన పబ్ రైడ్ లో అడ్డంగా బుక్కైన సంగతి. ఆమె అక్కడ డ్రగ్స్ తీసుకుందో లేదో ఇప్పటికి స్పష్టంగా తెలియనప్పటికి.. చాలామంది ఆమె డ్రగ్స్ తీసుకోలేదు అనే అంటున్నారు. కేవలం నీహారిక అక్కడికి తన ఫ్రెండ్ బర్తడే పార్టి కోసమే వెళ్లిందని .. ఇక అలా ఎంజాయ్ చేస్తూ లేట్ అయ్యిందని..ఇంతలోనే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్ చేశారని అంటున్నారు. అయితే ఈ రైడ్ లో బడా బడా స్టార్ డాటర్స్ ఉన్నా.. కేవలం నీహరిక పేరు మాత్రమే హైలెట్ గా నిలిచింది.

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్..పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టి హీట్, అటు నీహారిక మామ కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి కావడంతో..ఈ ఇష్యూని ఇంకా హైలెట్ చేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ కూడా నీహారికను ప్రశ్నించేది ఒక్కటే.. ఉగాది పండుగ నాడు పబ్ కి ఎలా వెళ్తావ్..? అది కూడా భర్త లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావ్..? అసలు నీ పర్స్ లో ఆ డ్రగ్స్ కవర్ ఎందుకు ఉంది..? ఈ మూడు క్వశ్చన్స్ కి మెగాడాటర్ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ సైతం ఆమెను అడుగుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ యాంటీ గ్రూప్ అయితే చెప్పనవసరం లేదు. బూతులు తిడుతూ నీహరికను ట్రోల్ చేస్తున్నారు.

కాగా, నీహారిక తప్పు ఉందో లేదో తెలియనప్పటికి.. వాళ్ళ అత్తింటి వాళ్ల తరుపున రిలిటీవ్స్ మాత్రం నీహారిక మామగారు జొన్నలగడ్డ ప్రభాకర్ కి కాల్ చేసి మరీ సూటి పోటీ మాటలతో టార్చర్ చేస్తున్నారట. మీ ఇంటీ కోడలు.. డ్రగ్స్ రైడ్ లో పట్టుబడిందా ..అంటూ కావాలనే రెచ్చకొడుతూ మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నాగబాబుకి కాల్ చేసి ..చాలా పద్ధతిగానే అడగాల్సిన నాలుగు అడిగేశాడట. “కూతురుని పెంచే పద్ధతి ఇది కాదు.. మీ సంబంధం చేసుకుని తప్పు చేశాం. మీ అమ్మాయి మా ఇంటి పరువు బజారుకి ఎక్కించింది. మీ కోడలు ఇలా చేస్తే ఏం చేస్తారు అండి” అంటూ చాలా హార్ష్ గా మాట్లాడి మెగా ఫ్యామిలీ బ్రాండ్ గురించి తప్పుగా మాట్లాడిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. దీంతో నాగబాబు కంటతడి పెట్టుకున్నారని..ఆ విషయం తెలుసుకున్న నీహారిక నాన్న ను చూడటానికి భర్తను ఒంటరిగా విడిచేసి మరి పుట్టింటికి వచ్చేసిందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు కదా..మీడియాకి దూరంగా ఉన్నారు.