బ్రో బ్రో అంటూ భారీ బొక్క వేశాడుగా..ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…?

వెండి తెర పై సినిమాలు ఎంత హిట్టో..బుల్లి తెర పై సీరియల్స్ అంతకన్నా డబుల్ హిట్ అవుతుంటాయి. సినిమా అయితే 2 గంటల 30నిమిషాలు. మహా అయితే ఓ నెల ఆ హడావుడి నడుస్తుంది. వాళ్ల కర్మకి సినిమా ఫ్లాప్ అయితే వారం రోజుల తారువాత ఆ సినిమా పేరు కూడా గుర్తు ఉండదు. అంత దారుణంగా ఉంటాది సినిమా ఫ్లాప్ అయితే పరిస్ధితి. కానీ బుల్లితెర పై సీరియల్స్ అలా కాదు ఏళ్లకు ఏళ్లు సాగదీస్తూనే ఉంటారు. ఒక్క చిన్న లైన్ ని కూడా వారం రోజులు చూపించే సత్త ఉన్నది సీరియల్స్ కే.

బుల్లి తెర పై నటీనటులు కూడా స్టార్ హీరో హీరోయిన్లకి తీసిపోని రేంజ్ లో పర్ ఫామెన్స్ లు ఇస్తున్నారు. వెండి తెర స్దాయిలో కాకపొయినా బుల్లితెర రేంజ్ లోనే నాలుగు ఐదు సీరియల్స్ చేస్తూ టాప్ ప్లేస్ ఉన్న ఓ తెలుగు యంగ్ సీరియల్ హీరో .. టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా ఉన్న ఓ స్టార్ సింగర్ చెల్లలిని పెళ్ళాడబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ లీడ్ ఛానెల్స్ లో సీరియల్ హీరో గా చేస్తున్న ఈయన ఓ సారి ఈవెంట్ లో భాగంగా.. ఆ స్టార్ సింగర్ ని..వాళ్ళ చెల్లెలిని కలిశాడట. అమ్మాయి కూడా పాటలు బాగా పాడుతుందట . ఆ ప్రోగ్రామ్ లో పాట పాడిన ఆమెను అప్రిషియేట్ చేస్తూ మాటలు కలిపి స్నేహం చేశాడని..అది కాస్త వాళ్ల మధ్య ప్రేమ గా మారిందని టాక్.

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే గత కొన్ని నెలలు గా వీళ్ల ప్రేమాయణం కొనసాగుతున్నా..ఆ స్టార్ సింగర్ అయిన అన్న కి మాత్రం తెలియదట. ఏదో ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటున్నారు..ఈవెంట్స్ కి వెళ్తున్నారు అనుకున్నాను కానీ..ఇలా బ్రో అంటూ నా కొంప ముంచి నా చెల్లినే పెళ్లి చేసుకుంటాడు అని అనుకోలేదంటూ ఫ్రెండ్స్ తో సరదా గా మాట్లాడారట. ఇరు కుటుంబ పెద్దలు కూడా వీళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..త్వరలోనే వీళ్ల పెళ్లి మ్యాటర్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారట సీరియల్ హీరో-సింగర్ చెల్లి. ఏది ఏమైనా ఒక్క ఈవెంట్ ఈ జంట ను కలిపింది అంటూ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.