KGF 2 సినిమాటోగ్రాఫర్ లైఫ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా….!

RRR హడావుడి ముగిసిపోయింది. ఇక ఇప్పుడు KGF 2 వంతు. అవును.. ఇపుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ మేనియానే నడుస్తోంది. ఇక దానికి కారణం ‘KGF 1’ అని చెప్పనవసరం లేదు. నిన్న అనగా ఏప్రిల్ 14న ‘KGF ఛాప్టర్ 2’ రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ప్రస్తుతం దేశాన్ని ఉర్రూతలూగించేస్తోంది.

ఈ క్రమంలో ‘KGF’ విషయంలో అందరూ ప్రత్యేకంగా అభినందిస్తోన్నది సినిమాటోగ్రఫీ గురించి. అవును.. అయితే ఇంతకీ, ఈ సినిమాకి పని చేసిన సినిమాటోగ్రఫీ ఎవరు ? అతని పేరు భువన్ గౌడ. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ‘ఉగ్రం’ నుంచీ ఆయనతోనే కలిసి పని చేస్తున్నాడు భువన్ గౌడ. మొదట ‘ఉగ్రమ్’ సినిమాకి ఇతగాడు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసాడు. ఈ విషయాన్ని స్వయంగా యష్ ఓ మీడియా వేదికగా వెల్లడించాడు.

స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వున్న భువన్ గౌడ మీద నమ్మకంతో, ఆయనకి సినిమాటోగ్రాఫర్‌గా ప్రశాంత్ నీల్ ప్రమోషన్ ఇచ్చాడన్నది యష్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఉగ్రం’ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో మెయిన్ సినిమాటోగ్రాఫర్ ఆ సినిమాకి హేండ్ ఇవ్వడంతో, అప్పటికి అప్పుడు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వున్న భువన్ సినిమాటోగ్రాఫర్ గా అవతరించాడు.

అతగాడి వయసు తెలుసా..?
మొదటి సినిమా అయినటువంటి ‘ఉగ్రం’ సినిమాతోనే తన కెమెరా వర్క్ ద్వారా భువన్ గౌడ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రశాంత్ నీల్ ఆస్తాన విద్వాంసుడిగా సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇంతకీ మనవాడి వయస్సు తెలిస్తే షాక్ అవుతారు. అవును.. జస్ట్ 19 ఇయర్స్ అంటే నమ్మబుద్ది కాదు. కానీ ఇది నిజం. చిన్నప్పటినుండి మనవాడు సినిమాల మీద ఇంటరెస్ట్ తో ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్టు భోగట్టా. ఇకపోతే, ప్రభాస్ ‘సలార్’కి కూడా ఇతనే సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.