అఫిషియల్: మూడు ముళ్లు వేయించుకున్న రష్మీ..షాక్ మామూలుగా లేదుగా..!!

వాట్..రష్మి పెళ్లి అయిపోయిందా..? నిజమా..ఎప్పుడు..ఎవరితో..? అనే ప్రశ్నలు మెదులుతున్నాయా మదిలో. కూల్ కూల్ .. రష్మి అనగానే మనకు బుల్లితెర జబర్ధస్త్ యాంకర్ రష్మి గుర్తు వస్తారు. అఫ్కోర్స్ తప్పు లేదు లేండి.. ఆమె పాపులారిటీ..ఫ్యాన్ బేస్ అలాంటిది. రష్మి అనగానే అందరి కళ్లు ఆమె పైనే పడతాయి. కానీ, మనం మాట్లాడుకునేది ఆ రష్మి గురించి కాదు..కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్‌ గురించి.

యస్..కొన్నాళ్లుగా యాక్టర్ రష్మి ..ప్రేమ, పెళ్లి గురించిన వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె తన చిన్న నాటి స్నేహితుడుని గత కొంత కాలంగా లవ్ చేస్తుందని.. ఇంట్లో పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోవడం లేదని కన్నడ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, అందరికి షాకిస్తూ.. తాను నచ్చిన మెచ్చిన ప్రేమించిన అబ్బాయినే పెళ్ళాడింది..రష్మీ ప్రభాకర్‌ . యస్.. అంగరంగ వైభవంగా అందరు చూస్తుండగా కుటుంబసభ్యుల మధ్య, తన ఫ్రెండ్స్ మధ్య, సినీ స్టార్స్ మధ్య రష్మి మెడలో మూడు ముళ్లు వేశాడు..ఆమె బాయ్ ఫ్రెండ్ నిఖిల్.

ఇన్నాళ్లు సింగిల్ గా ఉన్న రష్మి జీవితంలో..ఇప్పుడు నిఖిల్ రాకతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. బెంగళూరులో ఏప్రిల్‌ 25న వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, మన తెలుగు వాళ్లకు రష్మి అనగానే జబర్ధస్త్ యాంకర్ రష్మి మైండ్ కి వస్తుంది. దీంతో అందరు షాక్ అవుతూ రష్మికి పెళ్లైపోయిందా అని నెట్టింట కొత్త చర్చలు మొదలు పెట్టారు. మరికొందరు అయితే త్వరలోనే మా రష్మి కూడా పెళ్లి చేసుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మి పెళ్లి వార్త ట్రెండింగ్ గా మారింది.