it’s Official: కాజల్‌ కి కొడుకు పుట్టాడొచ్చ్ .. పేరు ఎంటో తెలుసా..?

కాజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది. తన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ ..పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మనకు తెలిసిందే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకునింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సైలెంట్ షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లి ఫోటోలు, హనీ మూన్ ఫోటోలతో పిచ్చెక్కించింది.

ఇక ఆ తరువాత రెండు బడా సినిమాలకు కమిట్ అయిన కాజల్..తాను ప్రెగ్నెంట్ అని తెలియడంతో సినిమాలనుండి తప్పుకుని..ఫుల్ టైం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ,, తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కానీ, ఫైనల్లీ మ్యాటర్ నెట్టింట లీక్ అవ్వడం..కాజల్ ని అభిమానులు పదే పదే ఆ విషయం అడుగుతుండటంతో..ఎట్టకేలకు తాను గర్భవతిని అని చెప్పి.. తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.

ఇక , నిన్న అనగా ఏప్రిల్ 19 న కాజల్ పండులాంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం నిన్న మార్నింగే బయటకు వచ్చినా..కాజల్ నుండి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో..ఫ్యాన్స్ ఫేక్ న్యూస్ అనుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే కాజల్ భర్త గౌతమ్..అలాగే కాజల్ చెల్లి నిషా ..ఈ విషయాని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. కాజల్-గౌతమ్ బిడ్డ పేరు ని కూడా అభిమానులకు తెలియజేశారు. NEIL KITCHULU..అంటూ ఆ బిడ్డకు పేరుని కన్ఫామ్ చేశారు. కాగా బిడ్డ ఫోటోని మాత్రం చూయించలేదు. ఇక సోషల్ మీడియాలో కాజల్ గౌతమ్ కి పలువు స్టార్స్ ..అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.