మీ బాగోతాలు తెలియనివా..జీవితా గురించి సంచలన మ్యాటర్ లీక్ చేసిన నిర్మాత..!!

గత కొన్ని రోజులు గా జీవితా రాజశేఖర్ పేర్లు నెట్టింట మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి జీవితా రాజశేఖర్ భార్య భర్త ల పద్ధతి అందరికి తెడా గానే అనిపిస్తుంది. పని కట్టుకుని ఓ ఫాయ్మిలీని టార్గెట్ చేయడం.. ఛాన్స్ చిక్కితే కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయడం వాళ్లకి అలవాటు అయిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. రాజకీయ జీవితంలో పార్టీలు మార్చేస్ జీవితకి .. నిజ జీవితంలో మాట మార్చడం పెద్ద కష్టం కాదు లే అంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే మీడియాలో గత కొన్ని రోజల నుండి జీవితా రాజశేఖర్ కు సంబంధించిన ఓ చీటింగ్ కేస్ విషయమై పెద్ద దుమారమే రేగుతుంది. రాజశేఖర్ హీరో గా నటించిన ‘గరుడ వేగ’ సినిమా గుర్తుంది కదా.. బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయానే అందుకున్న ఈ సినిమా నిర్మాత..వాళ్ల పై చీటింగ్ కేసు పెట్టారు. జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టి మరీ..మీడియా ముందు కు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. జీవితా రాజశేఖర్ మా వద్ద రూ. 26 కోట్ల అప్పు తీసుకుని .. ఇప్పుడు అడుగుతుంటే మాట దాటేస్తున్నారని.. వాళ్ల వాదన.

అయితే, దీని పై జీవితా స్పందిస్తూ.. మేము ఎవ్వరిని చీట్ చేయలేదు.. నిజానిజాలు కోర్టు లోనే తేల్చుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమపై కేసు పెట్టినవాళ్ళు కూడా ఉత్తములు కాదని, మా పరువు తీయడానికే వారు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి కౌంటర్ గా మళ్లీ కోటేశ్వర రాజు హేమ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి..సంచలన విషయాలను లీక్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా.. నిర్మాత కోటేశ్వర రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఆయన మాట్లాడుతూ..” జీవితా మీరు అనుకుంటున్న అంత మంచిది కాదని.. ఆమె ఓ కన్నింగ్ లేడీ అని..డబ్బు కోసం ఆమె మామ వరదరాజు తో వచ్చి..నా భార్య కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడింది అని..వాళ్ల మామ ఆమె కాళ్ళు పట్టుకునింది అని కాదు.. నా ముఖం చూసి ఇవ్వు అని అడిగితే..నేను 26 కోట్లు ఇచ్చానని. డబ్బు ఇచ్చిన టైంలో మేము వాళ్లకి దేవుడిలా కనిపించామని..ఇప్పుడు డబ్బు అడుగుతుంటే..వాళ్లకి శత్రువులు లా అయిపోయామని. నా సంగతి వాళ్లకి తెలియదు. ఆవలిస్తే పేగులు కౌంట్ చేసే టైప్. అయినా మీ బాగోతాలు ఎవ్వరికి తెలియవు. యాక్సిడెంట్లు చేసి..తప్పించుకుని కవర్ చేసే క్యాండిడేట్లు మీరు. కోర్టులోనే తెల్చుకుంటాం అన్నారు గా.. ఓకే తెల్చుకుందాం..అక్కడే..”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.