వామ్మో ..మహేశ్ కొంప ముంచేటట్లున్నాడే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ నమ్మకం. చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు.. ఎవర్ కూల్ హ్యాండ్ సమ్ హీరో అనే బిరుదు ఉంది. కానీ, ఎందుకో ఇప్పుడు ఆ ట్యాగ్ ఆయన పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలు అంటే కస్సుమని లేచే ఈ హీరో..ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా డైరెక్టర్ తో చేతులు కలిపిన్నట్లు టాక్ వినిపిస్తుంది.

మొన్నటికి మొన్న ఓ ఈవెంట్ లో మీరూ బాలీవుడ్ లో సినిమాలు చేయారా అని అడిగినదానికి.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తేనే జనాలు చూస్తారా.. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ డబ్ అవుతున్నాయి..అలా కూదా జనాలు చూడచ్చు అంటూ రిపోర్టర్ కి ఘాటుగా ఆన్సర్ ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు ఇంటికి పిలిపించుకుని స్టోరీ విన్నాడంటే.. కధ తేడా కొడుతుందని అంటున్నారు సినీ ప్రముఖులు. మహేష్ కి ఆ ఊద్దేశ్యం లేకపోయినా.. ఆయన భార్య నమ్రతా ఎప్పటి నుండో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుందనే టాక్ ఉంది.

ఇక ఇప్పుడు ఆ మ్యాటర్ కన్ఫామ్ అయిపోయింది. ఇన్ సైడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ కి ఆ బడా బాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ బాగా నచ్చేసిందట. ఒకటి రెండు సీన్ల మినహాయిస్తే ,,కధ బాగుందని.. త్వరలోనే ఫైనల్ గా అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కవేళ్ల అదే నిజం అయితే మహేష్ ని టార్గెట్ చేయడానికి మిగతా హీరో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా అంటే ఫైర్ అయ్యే మహేష్.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా చేయడానికి ఎలా ఉప్పుకున్నాడు అంటూ ట్రోల్ స్టార్ట్ చేశారు. ఇక అఫిషియల్ గా అనౌన్స్ చేశాక మ్యాటర్ ఎలా ఉంటుందో..?