హృతిక్ రోషన్ కి ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ ..?

హృతిక్ రోషన్ అంటే ముందుగా సినిమా అభిమానులకు గుర్తొచ్చేది.. కండలు తిరిగిన శరీరాకృతి, సూది ముఖం, అదరగెట్టే డాన్స్.. మొత్తంగా దిమ్మతిరిగే అందం. అవును. అప్పటి తరం అమ్మాయిలకు హృతిక్ ఓ కలల రాకుమారుడు. అందుకేనేమో అతన్ని బి టౌన్ సరదాగా గ్రీకు వీరుడు అని పిలుస్తుంది. కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇతగాడు అనతికాలంలోనే సూపర్ స్టార్ గా అవతారం ఎత్తాడు. తరువాతి కాలంలో ‘సుహానే’ని పెళ్లి చేసుకున్న హృతిక్ మంచి భర్త పేరు సంపాదించాడు. మరి ఇంతలో లోకం దిష్టి తెగిలిందేమోగాని.. తరువాతి కాలంలో వరుసగా ఎన్నో రూమర్స్, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు.

హృతిక్ vs కంగనా రనౌత్‌:

ముందు ఈ బాలుడు మంచివాడుగా పేరు తెచ్చుకున్న హృతిక్, తరువాత చాలా మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నెరిపిన ప్లే బాయ్ గా చెడ్డపేరు మూటకట్టుకున్నాడు. హృతిక్ కంగనా రనౌత్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలో, సహనటి బార్బరా మోరీతో కూడా వివాహేతర సంబంధంలో నిమగ్నమై ఉన్నాడని అప్పట్లో పుకార్లు షికారు చేసేవి. ఆ తర్వాత హృతిక్, కరీనా కపూర్ మీద కూడా రూమర్లు నడిచాయి. మై ప్రేమ్ కి దీవానీ హూన్ సినిమా చిత్రీకరణ సమయంలో హృతిక్, కరీనా మధ్య సంబంధాలు మరింత దగ్గరయ్యాయి. హృతిక్ రోషన్ కు నిజానికి అప్పటికి సుహానేతో పెళ్లయింది కూడా.

హృతిక్ రోషన్ vs ప్రియాంక చోప్రా:

హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా మధ్య కూడా లవ్ అఫైర్స్ నడిచినట్టు అప్పట్లో కోకొల్లలుగా మీడియాలు కధనాలు రిలీజ్ చేసాయి. అలాగే హృతిక్, కత్రినా కైఫ్‌తో కూడా డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు నడిచాయి. ఇకపోతే ఈ క్రమంలో కంగనా రనౌత్ హృతిక్ రోషన్‌తో విడిపోవడానికి కత్రినా కైఫ్‌ కారణం అని కూడా ఓ టాక్ బాలీవుడ్ నుండి వినిపించేది. హృతిక్ మరియు కత్రినా మధ్య డేటింగ్ పుకార్లపై రిపోర్టర్ ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందించడం కొసమెరుపు. ఈ క్రమంలో కత్రినా కైఫ్‌కి హృతిక్‌ దూరంగా ఉండాలి అని సల్మాన్‌ హెచ్చరించిన మాట తెలిసినదే. ఈ రకంగా గుడ్ బాయ్ కాస్త బ్యాడ్ బాయ్ అయ్యాడు.