నీహారిక జోలికి రావద్దు..ఒక్క ఫోన్ కాల్ తో బయటపడిన మెగాడాటర్..?

మెగా డాటర్ నీహారిక..గత కొద్ది రోజుల నుండి నిత్యం మీడియాలో ఏదో ఒక్క టాపిక్ తో ట్రెండింగ్ లో ఉంటుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన మగపిల్లలు గురించి మీడియా లో వార్తలు రావడం చాలా తక్కువ.. వస్తే అది సినిమాల గురించి లేక పెళ్లి విషయం గురించి. కానీ ఆ ఇంటికి సంబంధించిన ఆడపిల్లలు మ్యాటర్స్ నెట్టింట ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. రీజన్ తెలియదు కానీ..చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నీహారిక మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు.

రెండు పెళ్లిలు,డివర్స్ మ్యాటర్ తో నెట్టింట శ్రీజ వ్యవహారం రచ్చ చేస్తుంటే..నీహారిక అల్లరి చిల్లర పనులు కారణంగా మెగా ప్యామిలీ పరువు పోతుందంటున్నారు అభిమానులు. ఇప్పుడు టీవీ పెడితే ఒక్కటే న్యూస్..మెగా డాటర్ డ్రగ్స్ తీసుకుందా..?, తప్పు చేసిన మెగా డాటర్ నీహారిక..?, అర్ధరాత్రి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ నీహారిక..?..వామ్మో ఇలాంటి వార్తలే ఇప్పుడు అన్నీ మీడియా చానెల్ ల్లో కనిపిస్తున్నాయి.

దీంతో నీహారిక డ్రగ్స్ తీసుకుందో లేదో తెలియదు కానీ..ఆమె తీసుకున్నట్లే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల పై కొద్దిసేపటి క్రితమే నాగబాబు సైతం ..స్పందించి..”నా కూతురు అలాంటిది కాదు. నిహారిక ఆ సమయానికి అక్కడ ఉంది..కానీ డ్రగ్స్ తీసుకోలేదు. పబ్ టైమింగ్‌ను ప‌రిమితికి మించి న‌డ‌ప‌టం వ‌ల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారిక‌కు సంబంధించినంత వ‌ర‌కు పోలీసులు చాలా క్లియ‌ర్‌. నిహారిక విష‌యంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని చెప్పారు” అంటూ వీడియో రిలీజ్ చేశారు. కాగా, మెగాడాటర్ నీహారిక బయటకు రావడం వెనుక ఆమె మామగారు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు హస్తం కూడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. మీడియా లో మెగాడాటర్ హైలెట్ గా నిలిచింది.