నిజంగానే చిరంజీవి బాగా మ్యానేజ్ చేశాడండోయ్..అది కనపడకుండా..మీరే చూడండి..!!

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా తనకంటూ ఓ సపరేటు ప్రేజీని లిఖించుకున్నాడు చిరంజీవి. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప అనుకునే రోజుల్లో..అలా వచ్చి..ఎవ్వరి సహాయం లేకుండా తన టాలెంట్ ని నమ్ముకుని ..ప్రతి సినిమాకోసం నిజాయితీగా కష్టపడి..ఆరోగ్యాని కూడా లెక్క చేయకుండా సినిమాలు చేస్తూ..అభిమానులను మెప్పిస్తు.. ఎప్పటికప్పుడు తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ..ఓ చిన్న స్దాయి హీరోగా నుండి ఇప్పుడు టాలీవుడ్ నే శాసించే స్దాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అలా ఎవ్వరు చేయలేరు అనడంలో సందేహం లేదు.

ఇక చీరంజీవి రీ ఎంట్రీ తరువాత కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ..బడా బడా ప్రాజెక్ట్స్ ని లైన్లో పెడుతూ..ఇంట్లో ని తమ మెగా హీరోలకి కంటే కూడా యంగ్ లుక్ లో అదరకొట్టేస్తూ..చరణ్ కి నాన్న లా కాదు అన్న లా కనిపిస్తున్నారు సార్ అంటూ కామెంట్స్ వినిపించేలా చేసుకుంటున్నారు. యస్..ఇప్పుడు అందరు అదే అంటున్నారు చిరంజీవి రీసెంట్ యాడ్ చూసి. మనకు తెలిసిందే దాదాపు కొన్ని సంవత్సరాలు తరువాత ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు చిరంజీవి.

ఈ మధ్యనే చిరంజీవి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో శుభ గృహ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో చిరంజీవితో పాటు కుష్బూ, అన‌సూయ‌ కూడా కలిసి నటించారు. యాడ్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రకు తగ్గ న్యాయం చేసారు..కానీ అందరు కళ్ళు చిరంజీవి పైనే ఉన్నాయి. ఎందుకంటే..ఈ యాడ్ లో చిరు చాలా స్మార్ట్ గా చూడటానికి చాలా యంగ్..నిజం చెప్పాలంటే అనసూయ కన్న కూసింత రెండు రెట్లు గ్లామర్ గా కనిపించారు. దీంతో ఈ యాడ్ లో చిరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అనసూయకీ, చిరంజీవికి మధ్య ‘మ్యానేజ్ చేశా..’ అనే ఓ డైలాగ్ వుంటుంది. ఆ డైలాగ్ ఇప్పుడు నెట్టింట తెగ పాపులర్ అయిపోయింది.శుభ‌గృహ‌ రియల్ ఎస్టేట్ యాడ్ లో చిరంజీవి తన ఏజ్ కనపడకుండా బాగా మ్యానేజ్ చేశాడని..మీమ్‌స్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. చిరంజీవి ఎలా మ్యానేజ్ చేశారంటూ నిజంగానే ఒకింత గట్టిగానే చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఆ యాడ్ మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి.