బిగ్ షాకింగ్:నెట్టింట లీకైన ఆ స్టార్ నటి పర్సనల్ ఫోన్ నెంబర్.. దరిద్రపు *** అంటూ ఫైర్..!!

ఏ ముహుర్తాన సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో కానీ..అప్పటి నుండి పరసనల్ అన్న మాటకు తావు లేకుండా పోతుంది. ఎక్కడికి వెళ్లినా..ఏం చేస్తున్న చేతుల్లో మొబైల్స్ పట్టుకోవడం..దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు జనాలు, ఈ సోషల్ మీడియా వల్ల జరిగే మంచికన్నా కూడా చెడు చాలా చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ సొషల్ మీడియా ద్వారా అమ్మాయిల రక్షణకు కరువైంది.

ఇప్పటికే ఈ సోషల్ మీడియా లో పలువురు హీరోయిన్ల పరసనల్ ఫోటోలు, వీడియోలు..వాళ్లకు సంబంధించిన రహస్య మ్యాటర్స్ నెట్టింట లీకై పెద్ద దుమారానే రేపగా..ఇప్పుడు తాజాగా,,ఓ నటి ఫోన్ నెంబర్ లీకై సంచలనంగా మారింది. బాలీవుడ్ బుల్లితెర నటి విభూతి ఠాకూర్‌‌..అందరికి సుపరిచితురాలే. తన అందంతోనే కాకుండా నటనతో ను మెప్పించిన ఈ బ్యూటీ పర్సనల్ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఎవరు చేశారో ఎలా చేశారో తెలియదు కానీ.. ఆమె నెంబర్ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది. ఇంకేముంది.. ఆ నెంబరు తీసుకుని పలువురు ఆకతాయిలు మెసేజ్లు పంపించారు.

ఫస్ట్ ఎవరో సరదాగ ఆటపట్టిస్తున్నారు అనుకుని భ్రమ పడిన ఆమె ఆ తర్వాత ఆ నెంబర్ కి అనేక మంది ఫోన్ చేసి వల్గర్ గా మాట్లాడం..నీచమైన వీడియోలు పంపిచడం..తప్పుడు మాటలు మాట్లాడుతుండటంతో అసలు విషయం తెలుసుకుని..తన నెంబరు ఎవరో కావలనే ఇలా లీక్ చేసారంటూ విభూతి ఠాకూర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఒక అమ్మాయితో త వల్గర్ మాట్లాడటం ..రాత్రి వస్తావా అంటూ అడగటం..చెత్త చెత్త వీడియోలు పంపడం మంచి పద్దతి కాదు అని..అలాంటి మాటలు వల్ల తాను ఇబ్బంది పడ్డాను అంటూ పోలీసులకు చెప్పుకొచ్చారట. తనతో అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళ ఆ ఫోన్ నంబర్స్, మెసెజ్ ల స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకొని చర్యలు చేపట్టారు పోలీసులు.