జక్కన్న మెచ్చిన నటుడి వైవాహిక జీవితం గురించి తెలుసా..?

సినీ ప్రపంచంలోకి ఏంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తమ కెరీర్ ను కొనసాగిస్తుంటారు. మరి కొంతమంది నటీనటుల మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టరు. మరికొందరు తమ కుటుంబానికి సంబందించిన విషయాలను మీడియా ముందు చెప్పుకోవటానికి కుడా ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళ గురించి తెలుసుకున్న కూడా ఆలోపు వాళ్ళు విడిపోయి ఒకరికి ఒకరు ఏ సంబంధం లేకుండా ఉంటుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి విషయమే.

సినీ యాక్టర్ చంద్రశేఖర్.. ఈయన తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసారు. అంతేకాదు ఈయన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుంటాడు. రాజమౌళి దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలోనూ జూనియర్ ఎన్టీఆర్ తో ఉండే కీలక పాత్రలో కూడా నటించాడు. నటుడిగా తన కెరీర్ ను నిలదొక్కుకుంటూ ఆయన వందలాది సినిమాల్లో నటించాడు. అయితే నటుడిగా ఇంత మంచి ఆదారాభిమానాలు సంపాదించుకున్న చంద్రశేఖర్ వైవాహిక జీవితంలో సరిగా రాణించలేకపోయాడు.

అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈయన ఎక్కువగా ఎక్కడా కూడా తన వ్యక్తిగత విషయాలను బయటకి చెప్పుకుంది కూడా లేదు.చంద్రశేఖర్ భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌. ఆమె పేరు నిలీయ భవాని. ఈమె తెలుగు ఇండస్ట్రీ లో చాలా సినిమాలలోనే నటించింది. ముఖ్యంగా పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్‌మెన్.. లాంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు తమిళంలోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది.

అయితే ప్రస్తుతం మాత్రం కొన్ని సీరియళ్లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. నీలియా భవానీ ఖమ్మం జిల్లా వాసి అయితే ఆమె షూటింగ్ లో చంద్రశేఖర్ ను చూసి ప్రేమలో పడింది. మరి ఆ సమయంలో చంద్రశేఖర్‌ నటుడిగా కెరీర్ ను నిలదొక్కుకోక పోవటంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో భవానీ చంద్రశేఖర్ లు ఇద్దరు హైదరాబాద్‌ పారిపోయి అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘శాంతి నివాసం’ సీరియల్‌లో చంద్రశేఖర్‌కు చిన్న అవకాశం దక్కింది. అటు తర్వాత చిన్నగా “స్టూడెంట్ ‘నం.1’ “సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే వీరి వివాహ జీవితం కొంత కాలం సజావుగానే గడిచింది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు ఓ కుమారుడు ఒక కుమార్తె. కుమారుని పేరు మహేశ్వరన్, కుమార్తె పూజిత. అయితే కొన్నాళ్లపాటు హ్యాపీగానే సాగిన వీరి దాంపత్య జీవితం ఒడిదుడుకులకు గురైంది. ఏవో చిన్న చిన్న మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటూన్నారు. ప్రస్తుతం భవానీ పిల్లల ఇద్దరిని తనతో తీసుకుపోయి వేరుగా ఉంటోంది. ఇదీ చంద్రశేఖర్ అసలు రియల్ స్టోరీ అయితే ఈ విషయాలు ఏవి కూడా మనలో చాలా మందికి తెలియవు అనే చెప్పాలి.