ఆచార్యలో అనసూయ అలాంటి పాత్ర చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హాట్ యాంకర్ అనసూయ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించిన అనసూయ, ఆచార్య చిత్రంలోనూ ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తుందట. ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రగా అనసూయ ఆచార్యలో కనిపిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ కూడా ఉంటుందని వారు అంటున్నారు. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనూసయ పర్ఫా్ర్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

దాంతో ఆచార్య చిత్రంలో అనసూయ కోసం చిరు ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేయాలని దర్శకుడు కొరటాలను కోరినట్లు తెలుస్తోంది. మరి ఆచార్య చిత్రంలో అనసూయ పాత్ర, ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.