ఆ అగ్రిమెంట్ నిజమైతే..సామ్-చై మళ్లి కలవాల్సిందే..తప్పదు..?

ఏంటి..నిజమా..చైతన్య-సమంత మళ్లీ ఒక్కటవుతున్నారా..అంటే నిజమనే అంటున్నారు సినీ ప్రముఖులు. కాని అది నిజ జీవితంలో కాదు..ఓ సినిమా విషయంలో. యస్.. తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఆయన భార్య సమంత కలిసి ఓ సినిమా లో నటించబోతున్నారట, నిజానికి ఈ సినిమా ను ఎప్పుడొ తెరకెక్కించాల్సింది.కానీ అనివార్య కారణాల చేత ఇప్పుడు వాళ్లు విడిపోయాక..తెరకెక్కిస్తున్నారట.

మనకు తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత..వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా వేరు వేరుగా ఉంటూ డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారని. కాగా , వీళ్లు కలిసి ఉన్నప్పుడు ఓ డైరెక్టర్ చెప్పిన కధకి ఫిదా అయ్యి..వెంటనే సినిమా చేద్దాం అని అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశారట. కానీ ఆ తరువాత పరిస్ధితులు మారిపోవడంతో..సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు..ఈలోపు వీళ్లు విడాకులు కూడా తీసుకునేశారు.

అయితే, ఇప్పుడు ఆ డైరెక్టర్..సమంత చైతన్యలతో కలిసి ఆ సినిమా చేయడానికి సిద్ధపడిందట. ఈ సినిమాలో నటించడానికి సామ్ చై ఒప్పుకున్నారట కానీ..కొన్ని కండీషన్స్ పెట్టారట. ఇద్దరు కలిసి ఒక్కే ఫ్రేమ్ లో కనిపించరు..ఒక్కే టైం లో ఇద్దరు షూటింగ్ జరగకూడదు..సెట్ లో చైతన్య ఉంటే సామ్ ఉందకూడదు..సామ్ ఉంటే చైతన్య ఉండకూడదు..సినిమా ప్రమోషన్స్ కి సామ్ రాను అని చెప్పేసిందట..సోషల్ మీడియా ద్వారానే ప్రమోట్ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చిందట. సామ్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ డైరెక్టర్ వాళ్ల పరిస్ధితులను అర్ధం చేసుకుని..కండీషన్స్ కు ఓకే చెప్పారట. మరి చూడాలి విడిపోయిన ఈ జంట విడి విడిగా షూటింగ్ ఎలా చేస్తుందో..?