వ్యభిచారిగా సమంత..ఆ నిజం ప్రూవ్ చేయడానికేనా..?

సమంత..టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఏమాయ చెసావే సినిమాతో అందరి మనసులను మాయ చేసి.. ఒక్క సినిమాతో తన తల రాతను మార్చేసుకున్న గొప్పనటి. మొదటి నుంచి సమంత ఢిపరెంట్ పాత్రలను చేయడానికే ఇంట్రెస్ట్ చూయిస్తుంది. మనం చూసిన్నట్లైతే నాగార్జున తో రాజుగారి గది సినిమా, యూ టర్న్ మూవీ, మజిలీ, ఓ బేబీ..ఇలా అన్ని ఓ సరికొత్త సమంతని మనకు చూపిస్తాయి. కేవల గ్లామరస్ పాత్రలే కాకుండా కంటెంట్ ఉన్న స్టోరీలను చూస్ చేసుకుంటూ వస్తుంది సమంత.

ఇక నాగచైతన్య తో విడాకుల తరువాత..కూడా మనసుకి బాధ వేసిన..కెరీర్ పరంగా మాత్రం ఎక్కడ తగ్గకుండా చూసుకుంటుంది. ఇప్పటికే చేతిలో అరడజను సినిమాలకు పైగా సైన్ చేసి రెడీగా పెట్టుకుని ఉన్న సమంత..తాజా గా మరో మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ఉన్న స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ఈ సినిమా లో ఎవ్వరు ఊహించని విధంగా ఓ వేశ్య పాత్రలో నటించనుందట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ మాటే నిజం అంటున్నారు సిని వర్గాలు.

ఇప్పటికే విడాకుల తరువాత ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో హాట్ గా కనిపించి అందరిని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ..ఇలాంటి పాత్రను చూస్ చేసుకోవడం వెనుక ఓ కారణం ఉంది అంటున్నారు. మగాడైన మొగుడు చేతకాని వాడై తాగుబోతు గా మారి డబ్బులు సంపాదించలేకపోతే.. ఆ కుటుంబాని పోషించడానికి ఓ భార్య తీసుకున్న సంచలన నిర్ణయం తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మనం మరో కొత్త సామ్ ని చూడబోతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి సమంత ఈ పాత్ర ద్వార అభిమానులకు ఎలాంటి సందేశం ఇస్తుందో..?