జయసుధ మొదటి పెళ్లిలో ఇన్ని కష్టాలా? ..పాపం

తెలుగు సినీ ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవటం ఆ తర్వాత ఏవో కారణాల వలన మనస్పర్థలతో విడిపోయి విడివిడిగా బతకటం సర్వ సాధారణ విషయం. అలనాటి తెలుగు సినీ పరిశ్రమలో ఆడ మగ అనే తారతమ్యాలు లేకుండా మగ వారికి ఎటువంటి క్యారక్టర్ అయితే ఇచ్చేవారో దానికి తగ్గట్టుగానే సమానమైన క్యారక్టర్ ఆడవారికి ఇస్తూ ఏంతో గౌరవంగా చుసుకునే వారు. అలా చేసిన వారిలో వాణీశ్రీ , సావిత్రి, జమున, జయప్రద, శ్రీ దేవి, జయసుధ, రాధిక ఇలా చాలా మందే ఉన్నారు. వీరు అప్పట్లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ అయినా జయసుధ మాత్రం అందరి హీరోలతో నటించి మంచి పేరు తెచుకున్నారు.

జయసుధ నటన చాలా సహజంగా ఉండటంతో అప్పట్లో ఆమెకు ఆడా మగ అనే తేడా లేకుండా చాలా మందే ఫ్యాన్స్ ఉండేవారు. అయితే అప్పట్లో జయసుధ మీద చాలా పుకార్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హీరో నవీన్ వడ్డే జయసుధ కొడుకనే ఇండస్ట్రీ మొత్తం మారు మోగిపోయింది. వాస్తవానికి నవీన్ వడ్డే తండ్రి వడ్డే రమేష్. ఈయన జయసుధకు అన్న అవుతారు. వడ్డే రమేష్ గారి బావమరిది అయిన రాజేంద్ర ప్రసాద్ ను జయసుధ పెళ్లి చేసుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. జయసుధ రాజేంద్ర ప్రసాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ విషయం వారి ఇంట్లో తెల్సి వాళ్ళు నిరాకరించటంతో వీరు రహస్యం గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తరవాత చేసేదేమిలేక గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందర్నీ ఆహ్వానించారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరినారాయణ రావు, మురళి మోహన్ వంటి వారు కూడా ఉన్నారు. పెళ్లి అయిన కొన్ని రోజులకు రాజేంద్ర ప్రసాద్ బిజినెస్ పనులు చూసుకోవటం స్టార్ట్ చేయటంతో జయసుధ కూడా సినిమాలు చేయటం మొదలు పెట్టారు.

ఈ తరుణంలో రాజేంద్ర ప్రసాద్ రోజు జయసుధను అనేక ఇబ్బందులు పెడుతూ టార్చర్ చేస్తుండటంతో విసిగిపోయిన జయసుధ విజయవాడ నుండి చెన్నై వెళ్లి అక్కడ విజయవాహిని స్టూడియో అధినేత నాగి రెడ్డిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పుకుంది. ఇది విన్న నాగిరెడ్డి గారు ఇండస్ట్రీ లోని పెద్దమనుసులైనటువంటి దాసరి లాంటి వాళ్లను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడగా రాజేంద్ర ప్రసాద్ ఏమి తెలియని అమాయకుడిలా ఉండిపోయారు.

దీంతో విసిగిపోయిన జయసుధ నాకు ఇతను అవసరం లేదు అని చెప్పి విడాకులు తీసుకుని విడి విడిగా ఉన్నారు. తరువాత జయసుద కొన్ని రోజులు అక్కడే ఉండి సినిమాలు చేయటం స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత జ‌య‌సుధ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిన్ క‌పూర్‌ను పెళ్లి చేసుకుంది. సినీ ఇండస్ట్రీ లో పెళ్లి చేసుకుని విడిపోయి విడాకులు తీసుకుని మళ్లీ తమ లైఫ్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.