సౌత్ నుండి బాలీవుడ్ కి చెక్కేసిన మన భామల పరిస్థితేంటి, ఇలా తయారవుతోంది?

ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాక ఇక్కడినుండి తట్టాబుట్టా సర్దుకొని, బాలీవుడ్ చెక్కేసేవారు. అలాంటివాళ్లలో టాలీవుడ్ గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇల్లు బేబీ బాలీవుడ్ ప్రయాణం:

అలా టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది ఇలియానా. మరి ఈ క్రమంలో ఏమయ్యిందో తెలియదు కానీ, ఈ ముద్దుగుమ్మ కన్ను బాలీవుడ్ పైన పడటంతో అక్కడికి చెక్కేసింది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు కూడా చేసింది. ఒక్క ‘బర్ఫీ’ తప్ప, ఇంకే సినిమా ఈమెకి లైఫ్ ని ఇవ్వలేదు. తరువాతికాలంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నీబోన్ తో ఆమె రిలేషన్ షిప్ కొన్నాళ్లపాటు మెంటైన్ చేసింది. ఆ తర్వాత అతనితో సెట్ అవకపోవడం తో బ్రేక్ అప్ చెప్పేసింది.

మరో హీరోయిన్ గురించి:

ఇక్కడ మరొక హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. నటి ఆసిన్. మొదట్లో అందం, అభినయంతో తెలుగునాట మంచి హీరోయిన్ గా అవకాశాలు చేజిక్కించుకుంది. శివమణి, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఘర్షణ మొదలగు సినిమాలు ఇక్కడ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె కూడా బాలీవుడ్ చెక్కేసింది. దాంతో ఇక్కడ నిర్మాతలు ఆమెని విడిచిపెట్టారు. ఇకపోతే బాలీవుడ్ ఆమెకి అంతబాగా కలిసి రాలేదు. చేసిన సినిమాలు దాదాపుగా ప్లాప్ అయ్యాయి. దాంతో ఆసిన్ పూర్తిగా సినిమాలకు దూరం అయింది. సౌత్ కూడా ఆమెని పట్టించుకోలేదు.