బన్నీ డైరెక్టర్ ను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరో.. అంత తలపొగరా..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే చాలా మంది హీరోలు విలన్ గా కూడా చేసి మెప్పిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువుగా కోలీవుడ్ హీరోలు ఉండడటం గమనార్హం. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో తమిళ హీరోలు ఎక్కువుగా కనిపిస్తున్నారు. అయితే, ఓ కోలీవుడ్ స్టార్ హీరో..మన తెలుగు హీరో సినిమాలో నటించనని ఫేస్ మీదనే చెప్పాడట. జనరల్ గా అయితే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన రిజెక్ట్ చేసింది బడా హీరోని. అందులోను స్టార్ డైరెక్టర్ మూవీలో నటించే అవకాశాని చేతులారా వదులుకున్నాడట ..కోలీవుడ్ స్టార్ హీరో కమ్ విలన్ “విజయ్ సేతుపతి”.

విజయ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నేను హీరోగానే సినిమాలు చేయాలని గిరి గీసిపెట్టుకోడు. పాత్ర మంచిదై..ముఖ్యంగా తనకు నచ్చాలి..అప్పుడే ఆ సినిమాకు సైన్ చేస్తాడు. లేదంటే నిర్మాతలు కోట్లు ఇస్తామన్నా కానీ..లెక్క చేయడు. అలాంటి బీహేవియర్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పుష్ప లో మంచి రోల్ ని మిస్ చేసుకున్నాడట విజయ్. బన్నీ హీరో గా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచింది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

కాగా, ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్రకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో కి సమానంగా విలన్ రోల్ ఉండటం సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి పాత్రను మిస్ చేసుకున్నాడు విజయ్. ఈ సినిమాలో విలన్ గా ముందు విక్రమ్ ని అనుకున్నారట. కానీ విక్రమ్ కొన్ని కారణాల వల్ల ఈ పాత్రను చేయలేకపోయారు. ఇక ఆ తరువాత ఈ పాత్ర కోసం విజయ్ ని అప్రోచ్ అవ్వగా..స్టోరీ విని ఫేస్ మీదనే నాకు నచ్చలేదు..సారీ నేను చేయను అని చెప్పేసాడట. దీంతో షాకైన మేకర్స్..మరోసారి ఒప్పించే ప్రయత్నం చేయగా ఆయన కోపడ్డారట. దీంతో మరో మాట మాట్లాడకుండా బయటకు వచ్చేసారట టీం. ఇక ఆ తరువాత భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను మీట్ అవ్వగా ఆయనకు స్టోరీ నచ్చడం..వెంటనే సైన్ చేయడం..సినిమా షూటింగ్ లో పాల్గొనడం చకచకా జరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర కొద్ది సేపే ఉన్నా హీరోతోసమానంగా పేరు తెచ్చుకున్నాడు. పార్ట్ 2 లో అయితే ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ అద్దిరిపోదంటున్నారు మేకర్స్. మరి చూడాలి పుష్ప ది రూల్ ఎలా ఉండబోతుందో..?