గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు..నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ ఇంటి ఆడవాళ్లకు అభిమానులు ఇచ్చే గౌరవం విలువ కట్టలేనిది. మన తల్లి చెల్లి లా సమానంగా చూసుకుంటారు..అలానే ఆదరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పిన తక్కువే. కోట్లకు ఆస్తి ఉన్న..ఆమె సింప్లిసిటీనే ఇష్టపడుతుంది.

ఆరోగ్యం , డైట్ విషయాల్లల్లో యమ స్ట్రీక్ట్ గా ఉండే ఈ మెగాకోడలు..ప్రజలకు కూడా తన డైట్ సీక్రేట్స్ చెప్పుతూ..హెల్తీ గా ఉండండి..ఆరోగ్యమే మహా భాగ్యం అంటూ పలు వీడియోల ద్వారా చెప్పుకొస్తుంది. కాగా, రీసెంట్ గా ఈ మెగా కోడలు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్ళు తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఉపాసన మెగా కోడలు మాత్రమే కాదు.. అపోలో హాస్పిటల్స్‌ చైర్‌ పర్సన్‌ కూడా అన్న సంగతి మనకు తెలిసిందే.

కాగా రీసెంట్ గా ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ విషయం ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన చేసే సేవా, సామాజీక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవనక్కర్లేదు. మనలో చాలా మందికి ఆమె చేసే సేవా కార్యక్రమాలు గురించి బాగా తెలుసు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రతిష్టత్మక అవార్డు నాట్‌ హెల్త్‌ సీఎస్‌ఆర్‌ అవార్డు ఆమెకు దక్కింది. గ్రామీణా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ చేస్తున్న కృషికి గుర్తింపు 2022 ఏడాదికి గానుఈ పురస్కారాన్ని ఉపాసన అందుకున్నారు. దీంతో ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ అందుకున్న ఉపాసన కి సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు బడా స్టార్స్ కూడా ఆమెకు విషెస్ చెప్పుతున్నారు. కంగ్రాట్స్ ఉపాసన You Deserve it అంటూ కామెంట్స్ చేస్తున్నారు.