అదే ఫార్ములా రిపీట్ అయితే..RRR దొబ్బిన్నట్లే..?

యస్..ఇప్పుడు చాలా మంది నోట ఇదే మాట వినిపిస్తుంది. సినిమా కి ఎంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో..అంతే రేజ్ లో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్ సినిమా “RRR”. గత సంవత్సర కాలంగా ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ పలు కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న ధియేటర్స్ వద్ద అప్పుడే పండగ వాతావరణం నెలకొంది.

అభిమానులు కెరింతలు , అరుపులతో సందడి సందడిగా ఉంది. ఓ వర్గం ఫ్యాన్స్ “జై ఎన్టీఆర్” అంటుంటే మరో వర్గం ఫ్యాన్స్ “జై చరణ్” అంటూ అరుస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ ని అభిమానులతో పంచుకున్నాడు ఉమైర్ సంధు. తాజాగా UA, UAE సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌ ఉమైర్ సంధు మొదటి సమీక్షను అందించాడు. ఆర్ఆర్ఆర్ రాజమౌళి యొక్క అద్భుత కళాఖండమని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకు ఫైవ్ రేటింగ్ ను ఇచ్చాడు. దీంతో RRR అప్పుడే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఉమైర్ తన ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇస్తూ.. “సెన్సార్ బోర్డ్ నుండి ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ. సినిమా చాలా బాగుంది. రాజమౌళి మార్క్ బాగా కనిపిస్తుంది. ఈ సినిమా ద్వార మనం మరో రామ్ చరణ్ ని చూస్తాం. చరణ్ యాక్టింగ్ సూపర్.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తారక్ నటన సినిమా కి ప్లస్ అవుతుంది. ఇక తారక్, చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. బాలివుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది”అంటూ పోస్ట్ చేశాడు.

అయితే, సోషల్ మీడియాలో అప్పుడే ఈ సినిమా పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొన్న రిలీజ్ అయిన రాధే శ్యామ్ సినిమాకి కూడా ఇలానే చెప్పాడు సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌ అయిన ఉమైర్ సంధు..కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే భారీ బొక్క పడింది. ఈ సినిమా కి నువ్వు 4.5 రేటింగ్ ఇచ్చావు..కానీ బాక్స్ ఆఫిస్ వద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..ఒక్కవేళ్ళ నీ ఫార్ములా కరెక్ట్ అయితే RRR సినిమా దొబ్బేయడం ఖాయం అంటు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.