సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. ఓ ట్రెండ్ సెటర్ మల్టీ స్టారర్ మూవీగా గా చరిత్రలో నిలిచిపోయింది. సినిమా కలెక్షన్స్ గురించి పక్కన పెడితే..ఈ సినిమా చూసిన ప్రతి ఒకరు కుటుంబం గురించి..కుటుంబం యొక్క విలువల గురించి నేర్చుకున్నారు..తెలుసుకున్నారు. సినిమాలో బూతు పదాలు..వల్గర్ సీన్స్ ఉంటేనే మరింతగా సినిమా హిట్ అవుతాయి అని నమ్మే సిట్యువేషన్ లో.. బంధాలు, బాంధవ్యాలు,ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మూవీనే ఈ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..” ఈ సినిమాకి స్టోరీ ఒక ప్లస్ పాయింట్ అయితే మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరోలు. ఇద్దరు బడా హీరోలను పెట్టి ఎవరినీ నొప్పించకుండా మల్టి స్టారర్ చిత్రం రూపొందించడం అంటే అది నిజంగా కత్తి మీద సామే. కానీ అటువంటి అరుదైన ఫీట్ చేసారు టాలీవుడ్ రారాజు దిల్ రాజు.

ఈ మూవీ చూసిన తరువాత ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే పెద్దోడు, చిన్నోడు అని పిలిస్తున్నారు జనాలు అంతలా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ జనాలకు రీచ్ అయ్యాయి. అన్నగా విక్టరీ వెంకటేష్, తమ్ముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి మెప్పించిన ఈ సినిమా 2013 లో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ 54.75 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా..అంజలి, సమంత నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఈ మూవీ నుంచి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేసింది.

కాగా, ఈ సినిమాని మొత్తంగా 9 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారట. అందులో ఆల్ మోస్ట్ అందరు బడా హీరోయిన్లే కావడం గమనార్హం. ఈ సినిమాలో సమంత పాత్ర కోసం అయితే పెద్దగా కష్టపడలేదట కానీ..సీత పాత్రకోసం అయితే నానా తిప్పలు పడ్డారట మెకర్స్. ఎందుకంటే..ఈ సినిమాలో ఆమెదే మెయిన్ రోల్ అందుకే ఈ పాత్రకి న్యాయం చేసే అమ్మాయికోసం చాలా నెలలు వెతికారట. ఈ క్రమంలోనే బడా బడా స్టార్ హీరోయిన్స్ త్రిష, స్నేహా, భూమిక, అనుష్క, నయనతార,తమన్నా లను అనుకున్నారట కానీ వాళ్లకు ఆ పాత్ర సెట్ కాకపోవడంతో చివరకు అమలపాల్ ఒకే చెప్పారట కానీ ఫైనల్ మూమెంట్ లో ఆమె ఎందుకో తప్పుకుంది. దాంతో అంజలి ఈ గోల్డెన్ ఛాన్స్ ను దక్కించుకుంది. అలాగే ఈ సినిమాలో రేలంగి మావయ్య పాత్రకి ముందుగా హీరో రాజశేఖర్ ని అనుకున్నారట కానీ ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేసారు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ఇంట్లో అందరు కలిసి కూర్చోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.