ఆ యంగ్ హీరో ఇక దుకాణం సర్దేయాల్సిందేనా?

టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని బాగా ఉపయోగించుకుంటే, అది మున్ముందు సక్సెస్ అందుకునేందుకు తోడ్పడుతుంది. అలా కాదని, కెరీర్‌ని లైట్‌గా తీసుకుంటే, ఎంత తొందరగా క్రేజ్ వస్తుందో అంతే తొందరగా ఫేడవుట్ అవ్వడం ఖాయం. ఇలా చాలా మంది హీరో హీరోయిన్లు మన ముందు ఓ మెరుపు మెరిసి, వారు వేసిన తప్పటడుగుల కారణంగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో కూడా దుకాణం సర్దేస్తాడా అంటే.. అవుననే అంటున్నాయి మనోడు చేస్తు్న్న సినిమాలు.

ఒక చిన్న సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ హీరో, ఆ సినిమాకు ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న ఓ బడా ప్రొడ్యూసర్ కమ్ హీరో వెనకుండి ప్రమోషన్స్ చేయించడంతో ఆ చిన్న సినిమా కాస్త పెద్ద సక్సె్స్ అందుకుంది. ఇక ఆ తరువాత ఈ హీరో ఎంచుకున్న కథలు కాస్త యూత్ ఫుల్ లవ్‌స్టోరీలు కావడంతో వరుసగా రెండు మూడు హిట్లు పడ్డాయి. ఇక అడపాదడపా సక్సెస్ వస్తున్నా, అనుకున్న స్థాయిలో మాత్రం ఇమేజ్ రాలేకపోయింది.

అయితే గతకొంత కాలంగా మనోడికి దరిద్రం ఏ రేంజ్‌లో పట్టుకుందంటే.. చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేస్తూ వచ్చింది. కనీసం నిర్మాతలు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావడం లేదంటే, మనోడు ఏ రేంజ్‌లో సినిమా సెలెక్షన్ చేస్తున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొదటి సినిమా నుండి ఒకే స్లాంగ్‌లో మాట్లాడుతూ వస్తున్న ఈ హీరో, తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఏమాత్రం మార్చుకోకపోవడం ఆయన పతనానికి ఓ కారణంగా చెప్పాలి.

ఇక ఈ హీరో నటించిన ఓ చిత్రం తాజాగా రిలీజ్ అయ్యింది. అయితే ఇది కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో మరోసారి ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు. మరి ఇకనైనా ఓ మంచి కథను ఎంచుకుని ఈ హీరో హిట్ కొట్టకపోతే, ఇక దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.