చైతు జ్ఞాప‌కాలు చెరిపిస్తోన్న స‌మంత‌… షాకింగ్ ప‌ని చేసిందిగా…!

అక్కినేని హీరో నాగచైతన్య – హీరోయిన్ సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన ఐదు నెలలు పూర్తయింది. వీరిద్దరి విడాకుల ప్రకటన టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలోనే పెద్ద సంచలనం అయింది. విడాకుల తర్వాత చైతు – సమంత ఇద్దరూ ఎవరి ప్రాజెక్టుల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇదిలా ఉంటే తాజా గుస‌గుస‌ ప్రకారం స‌మంత తన పెళ్లి చీర‌ను అక్కినేని కుటుంబానికి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తనను పెళ్లి కూతురును చేసినప్పుడు త‌న‌ అత్త అమల స్వయంగా క‌ట్టిన‌ పెళ్లి చీరతోపాటు చైతన్య జ్ఞాప‌కాలు కూడా సమంత తిరిగి పంపించేసిందట.

చైతు జ్ఞాపకాలతో పాటు అక్కినేని కుటుంబ జ్ఞాపకాలు ఒక్కొక్కటి మర్చిపోయేందుకే వాటిని తిరిగి పంపిం చేస్తుందని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కిన మనం సినిమాలో చైతు – సమంత జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమాయణం చిగురించింది. ఈ ప్రేమ‌కు చిగురించ‌డానికి ముందే ఆమెకు మ‌రో హీరో సిద్ధార్థతో బ్రేకప్ అయింది. మనం తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి ఆటోనగర్ సూర్య సినిమాలో కూడా నటించారు.

4-5 సంవత్సరాలు ప్రేమించుకున్న చైతు – సమంత 2017 లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా వీరిద్ద‌రు క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మజిలీ సినిమా చేశారు. నాలుగేళ్ల కాపురం అనంతరం గత ఏడాది అక్టోబర్లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో గోవాలోని ఓ రిసార్టులో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ల‌ప్పుడే సమంతకు నాగ చైతన్య అమ్మ‌మ్మ ఓ చీర ఇచ్చింది.

ఆ చీర కట్టుకొని పెళ్లి పీటలు ఎక్కిన‌ సమంత ఇప్పుడు ఆచీరనే చైతన్య కుటుంబానికి తిరిగి ఇచ్చేసిందట. ఇక తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో య‌శోద‌ సినిమాలో నటించేందుకు కూడా ఓకే చెప్పింది. అలాగే తమిళంలో విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో నయనతారతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. కార్తీ హీరోగా మరో సినిమాకు ఓకే చెప్పింది. ఇటు చైతు కూడా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా తో పాటు పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.