అదే కనుక నిజమైతే..ఆచార్య అట్టర్ ఫ్లాప్ అవ్వాడం ఖాయం..ఎందుకంటే..?

యస్..ప్రస్తుతం ఇదే టాపిక్ నెట్టింట పెద్ద రచ్చ రచ్చ చేస్తుంది. గత కొంత కాలంగా మెగా అభిమానులు చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెర పై చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..కాజల్ హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అస్సలు అన్ని అనుకున్నట్లే జరిగుంటే ..ఇప్పటికే ఈ సినిమా రిలీజై ఉండాలి.

కానీ, కరోనా కారణంగా, పలు సినిమాల రిలీజ్ డేట్స్ కు అడంకుల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ పడుతూ వచ్చి..ఫైనల్ గా ఏప్రిల్ 29 న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మెగా అభిమానులకు నచ్చే ఎన్నో అంశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తుండటం మరో విశేషం. చరణ్ కు జోడీగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తుంది. లంగా వోణీలో చాలా అందంగా కనిపిస్తుంది.

అయితే , ఈ సినిమా కు సంబంధించి ఓ కొత్త రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఇండస్ట్రీలో ఓ నమ్మకం ఉంది. ఏ హీరో అయితే రాజమౌళి సినిమాలో నటిస్తాడో..ఆయన తరువాతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఓ నమ్మకం. ఇప్పటి వరకు మనం చూసిన్నట్లైతే అందరి హీరోల విషయాలల్లో అదే జరిగింది. ప్రభాస్, రవితేజ్, సునీల్, రాం చరణ్, తారక్ ఇలా ఆల్ మోస్ట్ అందరి హీరోల కెరీర్ కు ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ పాయింటే. ఇక ఇప్పుడు చరణ్ RRR సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క వేళ ఈ సెంటిమెంట్ నిజమైతే..చరణ్ తరువాతి సినిమా “ఆచార్య”నే. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టనుందన మాట అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?