స్టార్ హీరో పక్కన కృతి..ఈసారి రచ్చ మామూలుగా ఉండదుగా..!!

కృతి శెట్టి.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్..అని పిలవచ్చు. అమ్మడు లక్ ఎలా ఉందంటే సైన్ చేసిన ప్రతి సినిమా హిట్. హిట్ కాదు బ్లాక్ బస్టర్ విజయాని అందుకుంటున్నాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. ఇంకా మన డైరెక్టర్లు వదులుతారా..నో ఛాన్స్..అమ్మడు కి పిలిచి పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. ముదురు హీరోయిన్లు..స్టార్ హీరోయిన్లు ఉన్నా కానీ..సీనియర్ స్టార్ హీరో లు కూడా అమ్మడు పైనే కన్నేశారు.

ఇప్పటికే నాగార్జున, నాని, సుధీర్ బాబు,లాంటి హీరో ల సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ..మరో అద్దిరిపోయే ఆఫర్ ను అందుకుంది. ఈ దెబ్బ తో కోలీవుడ్ లోను అవకాశాలు వచ్చేలా స్టార్టింగ్ సినిమానే బడా హీరోతో పట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది లెటేస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి. ఇంతకన్నా లక్కి గర్ల్ ఎవ్వరు ఉంటారు చెప్పండి. కోలీవుడ్ డెబ్యూ నే బడా హీరో తో బడా డైరెక్టర్ డైరెక్షన్ లో చేయబోతుంది.

కోలీవుడ్ టాప్‌ డైరెక్టర్‌ బాలా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండి ఈ వార్తలు వినిపిస్తుండగా ఈ మధ్యనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సూర్య పక్కన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సూర్య, బాల డైరెక్షన్ లో ‘నంద’,‘పితామగన్’వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా పై భారీ అంచానాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించారు. షూటింగ్‌ సోమవారం కన్యాకుమరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మరి చూడాలి సూర్య పక్కన కృతి ఎలాంటి విజయం అందుకుంటుందో..?