పూజా హెగ్డేతో చాలా ఇబ్బందులు పడ్డ..నా వల్ల కాలేదు..సంచలన విషయాలను బయటపెట్టిన ప్రభాస్‌..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్..తగ్గెదేలే అన్నట్లు సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఏ ముహుర్తాన బాహుబలి సినిమాకి సైన్ చేసాడో కానీ అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఫ్లాప్ అయిన సినిమాకి కూడా కోట్లలల్లో పారితోషకం తీసుకుంటూ..ఏ హీరో కూడా టచ్ చేయని విధంగా టాప్ పోజీషన్ లో ఉన్నాడు . శుక్ర మహాదశ అంటే అదేనేమో.. అలా రాసిపెట్టుంది ప్రభాస్ కి.

వరుస పాన్ ఇండియా మూవీలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరో ఆరు రోజుల్లో ‘రాధేశ్యామ్‌’ మూవీతో మనల్ని పలకరించడానికి రెడీగా ఉన్నాడు. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్ లో పూజా హెగ్డే-ప్రభాస్ జంటగా కలిసి నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ టీం ప్రమోషన్స్‌ పనులను స్పీడ్‌ అప్ చేసింది. పాన్ ఇండియా మూవి గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం క్షణం కూడా తీరికలేకుండా.. చిత్ర బృందం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్‌.. అక్కడ పలు చానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ‘రాధేశ్యామ్‌’పై గురించి ఇంట్రెస్టింగ్విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పూజా తో రొమాన్స్ పై మాట్లాడుతూ..”ఈ సినిమాలో ఫస్ట్ టైం ముద్దు సీన్స్ లో నటించాను. డైరెక్టర్ కి ముందునుండే వద్దు వద్దు అని చెప్పుతున్న వినలేదు. నాకు ముందు నుండే ముద్దు సీన్స్‌ అంటే చాలా సిగ్గు. కానీ డైరెక్టర్ బలవంత చేసేసరికి రాధేశ్యామ్‌ కథ డిమాండ్‌ మేరకు అలా చేయక తప్పలేదు. నా ముందు సినిమాలంటే యాక్షన్ సీన్స్ పాటు మాస్ ఎక్కువగా ఉండడంతో ముద్దు సీన్ల నుంచి తప్పించుకున్నా..కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఈ సినిమా టోటల్ ప్రేమకథ. లవ్..రొమాన్స్,ఫీలింగ్స్, అంటూ సాగుతుంది. ఇక ఇలాంటి ప్రాజెక్ట్స్ లో అలాంటి సీన్స్ ని పక్కన పెట్టలేం. నా కో స్టార్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ముద్దు సీన్స్ చేసేటప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఉండేలా చూసుకోమని డైరెక్టర్ కు చెప్పాను. దీంతో డైరెక్టర్ ఒక ప్రైవేట్ స్పేస్ లోకి తీసుకెళ్లి మా మాధ్య అలాంటీ సీన్స్ చిత్రీకరించారు. అంతేకాదు షర్ట్‌ లేకుండా నటించాలన్నా కూడా నాకు సిగ్గు..అందరి ముందు అలా యాక్ట్‌ చేయడం నా వల్ల కాలేదు” అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

Share post:

Popular