నా కెరీర్ నాశనం చేసింది అతనే..సంచలన మ్యాటర్ బయటపెట్టిన పూనమ్..?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందిరా నయానా ..ఆంటూ పలువు హీరోయిన్లు..క్యారెక్టర్ ఆర్టిస్ట్లు..నెత్తినోరు మోత్తుకున్నా..వినే నాధుడే లేకపోయారు. మమ్మల్ని సినిమాలో అవకాశాల పేరు తో వాడుకున్నారు..అని స్వయంగా హీరోయిన్స్ చెప్తున్నా కానీ..ఇండస్ట్రీలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ సినిమాల్లో బిజీ గా ఉంటున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఎవరు బాధ్యత తీసుకోకపోయినా పర్లేదు కానీ..ఒక ఆడదాని ఇలా వాడుకుని వదిలేస్తుంటే పట్టించుకునే బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఉంది అంటూ సదరు బాధితులు చెప్పుకొస్తున్నారు.

తాజాగా నటి పూనమ్ కౌర్ తన సినీ కెరీర్ లో పడిన ప్రాబ్లమ్‌స్ గురించి మీడియా ముందు బయట పెట్టింది. పూనమ్ కౌర్.. చేసిన సినిమాలకన్నా కూడా ఆమె పై వచ్చిన రూమర్స్ కి..ఆమె చేసిన కాంట్రవర్షీయల్ కామెంట్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఎస్‌వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటూ తేడా లేకుండా అన్నీ కవర్ చేసింది…కానీ ఆమె అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది. ఆ తరువాత ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడి..జాలీగా తిరిగిందని..దాని రిజల్ట్ తోనే అమ్మడుకి కడుపు కూడా వచ్చిందని అప్పట్లో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

నిన్న మొన్నటి వరకు కూడా ఆ హీరో గురించి పబ్లిక్ గానే కామెంట్స్ చేసింది. అయితే , ఆ తరువాత తనను ఓ స్టార్ డైరెక్టర్ అవకాశాల పేరు తో మోసం చేశాడని..పరోక్షంగా ఆయన పేరు చెప్పుతూ శాపనార్ధాలు కూడా పెట్టింది. ఆయన బడా డైరెక్టర్ కావడంతో ఆమె కావాలనే ఇలా చేస్తుంది అంటూ ఆమె మాటలను లైట్ తీసుకున్నారు సినీ పెద్దలు. ఇక అంతటిటో మ్యాటర్ కూల్ అయ్యింది అనుకుంటే..రీసెంట్ గా మరో బాంబ్ పేల్చింది ఈ బ్యూటీ.

ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ణాతిచరామి”. అరవింద్‌ కృష్ణ, సందేశ్‌ బురి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి నాగు గవర దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై జై. వైష్ణవి కె నిర్మించారు. ఈ సినిమాను మార్చి 10న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యారు. ఈ సినిమా బృందం తాజాగా హైదరాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక అప్పుడు పూనమ్ మాట్లాడుతూ..”సినిమాలు అంటే ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చానని..కానీ కొందరు చేసిన మోసానికి బలైపోయాను అని.. ఒకానోక టైంలో ఆ బాధలు భరించలేక సినిమాలను వదిలేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని దేశం విడిచి వెళ్లిపోదామనుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చిన కొందరు పెద్ద మనుషులు రావణులు లా నన్ను ఎదగనీకుండా అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు నా జీవితంలోకి వచ్చి నాశనం చేసి వెళ్లిపోయారని అంటూ మరోసారి తాను మోసపోయానని గుర్తు చేసుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీలత పాత్ర నా రియల్ లైఫ్ పాత్ర చాలా దగ్గర ఉంటుందని..అందుకే ఈ సినిమా ఓకే చేశానని..మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఆడపిల్ల పడే బాధ ఈ సినిమాలో క్లీయర్ గా చూపించామని” చెప్పుకొచ్చింది.

Share post:

Popular