పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమానాయక్. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించేందుకు భీమ్లా కొంచెం దూరంలోనే ఉంది. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో హీరో దగ్గుబాటి రానా నటించగా…. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటించారు.
పవన్ గత ఏడాది నటించిన సినిమా వకీల్‌సాబ్‌తో పాటు ఇప్పుడు భీమ్లానాయక్.. ఈ రెండు కూడా రీమేక్ సినిమాలే. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వకీల్‌సాబ్, మల్లు వుడ్ లో హిట్ అయిన అయ్యప్పన్ కోషీయమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్‌గా తాజా సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ లైనప్ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న భవదీయుడు భగత్‌సింగ్ … కోలీవుడ్‌లో సముద్రఖని నటించి తెరకెక్కించిన వినోదాయ సితం సినిమా రీమేక్‌లో కూడా నటించనున్నాడు.
విచిత్రం ఏంటంటే వినోదయ సిత్తం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ కథలో మార్పులు చేర్పులు చేసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. క్రిష్ హరిగా వీరమల్లు షూటింగ్ పూర్తయిన వెంటనే భవదీయుడు భగత్‌సింగ్ పక్కన పెట్టేసి కోలీవుడ్ సినిమా రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కే ఛాన్సులు కనిపించడం లేదు.
హరీష్ శంకర్ సైతం పవన్ తనకు ఎప్పుడు డేట్లు ఇస్తాడు అని.. ఇప్పటివరకు ఎదురుచూస్తూ వచ్చాడు. అయితే ఇప్పుట్లో పవన్ డేట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో హరీష్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.