ప్లీజ్..వదలద్దు..నాగచైతన్య అన్బిలీవెబుల్ కామెంట్స్.. వైరల్..!!

అక్కినేని నాగచైతన్య మొదటి నుండి సైలెంట్ క్యారెక్టర్ అన్న విషయం మనకు తెలిసిందే. వివాదాలోకి పోకుండా తన పని తాను చూసుకుంటూ ఉన్న తన చిన్న ప్రపంచంలోనే హ్యాపీగా ఉండటం ఆయనకు చాలా ఇష్టమట. స్టార్ హీరోయిన్ సమంతను పెళ్ళి చేసుకున్నాక ఆ ఆనందం డబుల్ అవుతుందని అనుకున్నా ఈయన .. మధ్యలోనే ఆ వివాహ బంధాని తెంచ్చుకోవడం బాధాకరం. ఇక విడాకుల తరువాత చైతన్య సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఈ మధ్యనే నాన్న నాగార్జున తో కలిసి బంగార్రాజు అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న చైతన్య..ప్రస్తుతం విక్రమ్​ కె కుమార్​ దర్శకత్వం వహిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్నారు, మరో వైపు ఓ హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఎంత బిజీ గా ఉన్నా తన వాళ్ల కోసం తనని నమ్మి ఆహ్వానించిన వాళ్ల కోసం చైతన్య ఎప్పుడు టైం ఇస్తుంటాడు. ఇప్పుడుకూడా ఎంత బిజీ గా ఉన్నా..తన ఫెవరేట్ కొరియోగ్రాఫర్ బృందా మాస్ట‌ర్ డైరెక్టర్ గా మారి చేస్తున్న సినిమా ఈవెంట్ కి రమ్మనని కాల్ చేయగానే ఆలోచించకుండా నో చెప్పకుండా వచ్చేశాడట.

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్‌ సల్మాన్ హీరోగా.. కాజల్‌ అగర్వాల్, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లుగా బృందా మాస్టర్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘హే సినామిక’. ఈ సినిమాతోనే ప్ర‌ముఖ సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ బృందా మాస్ట‌ర్ ద‌ర్శ‌కురాలిగా మారారు. జియో స్టూడియోస్‌, గ్లోబ‌ల్ వ‌న్ స్టూడియోస్ ప‌తాకాల‌పై రూపొందించిన ఈ చిత్రం మార్చి 3న విడుద‌ల‌వుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సంద‌ర్బంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు మేకర్స్. ఈ కార్య‌క్రమానికి వన్ ఆఫ్ ది గెస్ట్ గా అక్కినేని నాగ చైత‌న్య‌ మాట్లాడుతూ..” బృందా మాస్టర్ కొరియోగ్ర‌ఫీకి నేను పెద్ద ఫ్యాన్‌. ‘మనం’ సినిమాలోని ‘కనులను తాకే..’ అనే మాంటేజ్‌ పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ మాస్టర్. మాస్టర్‌గారు ఓ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్నారని..అది కూడా లవ్ స్టోరీ లాంటి సినిమా అని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. మాస్టర్ మీరు సినిమాలను డైరెక్ట్‌ చేసినా.. కానీ కొరియోగ్రఫీ మాత్రం వదలకండి .. ప్లీజ్”అంటూ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.