కృష్ణ – శ్రీదేవి చేసిన ప‌నికి ఇండ‌స్ట్రీ అంతా షాక్ అయ్యింది…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదైనా సరికొత్తగా పరిచయం చేయాలంటే కేవలం ఈ హీరో కే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక అలాగే అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం తో పాటుగా నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే కృష్ణ ,శ్రీదేవి కలిసి ఒక నిర్మాతకి ఇల్లు కట్టించారనే వార్త వినిపిస్తోంది వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ తనతో నిర్మించిన సినిమాలు సరిగా ఆడక పోతే ఖచ్చితంగా వారికి రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేవారట. లేదంటే మరొక సినిమాని ఉచితంగానే చేసేవారట. అలా తన సొంత ఇంటిని కట్టుకోవాలని ఎంతో ఆశతో ఉన్న నిర్మాతకు కృష్ణ తో పాటుగా శ్రీదేవి మరి కొందరు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఇంటి తో పాటుగా అమ్ముకున్న పొలాన్ని కూడా తిరిగి కొనుకున్నారట. ఇక అసలు విషయంలోకి వెళితే మామ అల్లుళ్ళ సవాల్ చిత్రంలో కృష్ణ – శ్రీదేవి జంటగా నటించారు.

ఇందులో కృష్ణ అక్క పాత్రలో జమున నటించగా.. జమున భర్తగా కైకాల సత్యనారాయణ నటించారు. ఇక వీరిద్దరికి కూతురుగా శ్రీదేవి నటించిన ది. అయితే చిత్ర నిర్మాత ఇల్లు కట్టుకోవాలని కోరికతో కృష్ణ, శ్రీదేవి డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్, జమున అందరు కూడా రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారట. అయితే ఈ నిర్మాత గతంలో సత్యనారాయణ తో” నా పేరు భగవాన్” అనే మూవీకి కుదరవల్లి సీతారామ మూర్తి ప్రొడ్యూసర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ చిత్రం ఎంతో బాగున్నప్పటికీ నిర్మాతకు డబ్బులు రాలేదట. దాంతో ఆయన తన సొంత ఊరు లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్న కల తీరలేదు. ఈ విషయాన్ని కృష్ణకు సత్యనారాయణ చెప్పడంతో.. మామ అల్లుళ్ళ సవాల్ చిత్రానికి రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. ఇక శ్రీదేవి, కృష్ణ జంటగా నటించిన చిత్రాలు 31. ఇందులో ఎన్నో చిత్రాలు హిట్ గా నిలిచాయి. అప్ప‌ట్లో ఈ విష‌యం సెన్షేష‌న్ అయ్యింది.