తార‌క్‌.. చేజేతులా చేసిన త‌ప్పేనా ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చ‌రణ్ నటించిన మల్టీ స్టారర్ సినిమా త్రిబుల్ ఆర్. రు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం అటు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ కూడా తన కెరీర్లో ఎంతో విలువైన మూడు సంవత్సరాల కాలాన్ని కేటాయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడంతోనే స‌రి పెట్టేస్తున్నారు. అలాంటిది ఒక సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాల టైం కేటాయించారు అంటే మామూలు విషయం కాదు.

త్రిబుల్ ఆర్ తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే రాంచరణ్ చాలా కథలు వినడంతో పాటు వరుసపెట్టి పేజీ ప్రాజెక్టులను ఓకే చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఎందుకో వెనక పడిపోయినట్టు కనిపిస్తోంది. ఓవైపు త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉండగానే చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా పూర్తి చేశాడు.

మరోవైపు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ ఇమేజ్ క్యాష్ చేసుకునేందుకు పాన్ ఇండియా దిశ‌గా చ‌ర‌ణ్ అడుగులు వేస్తూ వెళుతున్నాడు. మరోవైపు కొరటాల శివ చెప్పిన కథ కూడా ఓకే చెప్పేసాడు. ఇలా వరుస పెట్టి సినిమాల‌ను ఓకే చేశాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ ముగిసి ఆరు నెలలు అవుతున్నా తార‌క్‌ ఇప్పటికీ ఏ సినిమా కూడా ప‌ట్టాలు ఎక్కించలేదు.

కొరటాల శివ సినిమా అంటూ ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అంతకు ముందు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని అనుకున్నా అది క్యాన్సిల్ అయింది. త్రిబుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ తన తర్వాత సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. తార‌క్‌ కూడా కాస్త జాగ్ర‌త్త‌గా ప్లానింగ్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.