సమంత అలాంటిదే.. షాకింగ్ విషయాలను లీక్ చేసిన జిమ్ ట్రైనర్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..ఓ కత్తిలాంటి ఫిగర్ అంటారు అభిమానులు. కొందరు అయితే కుందనపు బొమ్మలా ఉంది అంటారు..మరి కొందరు ఓ బేబీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు ఎవ్వరు ఎలా పిలిచిన సమంత హ్యాపీగానే ఫీల్ అవుతుంది. అది ఆమె క్యారెక్టర్. సమంత కి సరదాగా ఉండడం అన్నా..జాలీగా తిరగడం అన్నా చాలా ఇష్టమట. ఈ విషయాని చాలా సంధర్భాలల్లో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మడుకి ఫిట్ నెస్ పిచ్చి ఉంది. బాడీ ఫిట్ గా ఉండాలి .. వర్క్ అవుట్స్ చేయాలని తన ఫ్రెండ్స్ కి కూడా సజీషన్స్ ఇస్తుంటుందట.

పెళ్లి తరువాత అయితే నాగ చైతన్య ఫుడ్ డైట్ విషయంలో ఆమె తీసుకున్న కేరింగ్ ఎవ్వరు చేయలేరు అనే చెప్పాలి. ప్లాంట్ బేస్ట్ డైట్ అని ఫ్రూట్ డైట్ అని,,వాటర్ డైట్ అని..ఇలా వారనికి ఓ డైట్ చేస్తూ..వన్ డే నే చీటింగ్ డే గా పెపెట్టుకుని ..ఆ రోజు కూడా లిమిట్స్ లో తనకు ఇష్టమైన ఫుడ్ తింటుందట. మళ్ళీ పక్క రోజు నుండి డైట్ కంటిన్యూ చేస్తుందట. ఇక వర్క్ అవుట్స్ విషయానికి వస్తే సమంత తన ఇంట్లో కన్నా కూడా జిమ్ లోనే ఎక్కువ టైం గడుపుతుంది అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. .ఇక తరచూ సమంత జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ వంటి కష్టమైన కసరత్తులను కూడా అలోవోకగా చేసేస్తోంది. తనకు నచ్చిన వర్క్ అవుట్స్ చేస్తూ నెటిజన్ల కు కూడా ఛాలెంజ్ చేస్తుంది.

కాగా, రీసెంట్ గా సమంత గురించి తన జిమ్ ట్రైనర్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సామ్ జిమ్ ట్రైనర్ జునైద్.. ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఒకవేళ సమంత హీరోయిన్ కాకపోయుంటే..ఖచ్చితంగా విరాట్ కోహ్లీలా పెద్ద అథ్లేట్‌ అయ్యిండేది. నేను ఎందుకు ఇలా చెప్పుతున్నాను అంటే.. ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత..నో కాదు నా వల్ల అవ్వడం లేదు అని చెప్పదు. ట్రై చేస్తుంది. మరొక్క‌సారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది. పక్కాగా చెప్పాలంటే సామ్‌ కి దూకుడుగా ఎక్కువ..క‌ష్ట‌మైన ప‌నులను ఎంత కష్టపడి అయినా చేయాలి అని అనుకుంటుంది. నేను ఇప్పుడు చెబుతున్నాను సమంతని చూసి నేను స్పూర్తి పొందుతున్నా. ఇక ‘పుష్ప’ సినిమాలో ఊ అంటావా సాంగ్ కోసం సమంత ఎంత కష్ట పడిందో ఎవ్వరికి తెలియదు. ఆ పాట కోసం చాలా వ‌ర్క‌వుట్లు చేసింది’ అంటూ సమంతను ఓ రేంజ్ లో పొగిడేశాడు.