ఛార్మితో ఎంజాయ్ చేస్తున్న RGV..నాకు ఫీలింగ్స్ ఉన్నాయి..ఫోటో వైరల్..!!

మహేష్ బాబు నటించిన టక్కరి సినిమాలో ఓ పాట ఉంది..గుర్తుందా..” నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో”..ఈ డైరెక్టర్ RGV కి కరెక్ట్ గా సరిపోతుందంటున్నారు నెటిజన్స్. దానికి కారణాలు చాలా నే ఉన్నాయి. అవి ఏంటో కూడా మనకు తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్షియల్ గా మారే ఇష్యూస్ లో ఈయన ఎంటర్ అవుతున్నారో..లేక ఈయన మాట్లాడటం వల్లనే అవి ఇంత కాంట్రవర్షీయల్ గా మారుతున్నాయో అర్ధం కావడం లేదట. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే వర్మ ప్రతి విషయంలోను వేలు పెడుతూ ..రచ్చ రంబోలా చేస్తున్నారు. అది సినిమాల విషయం కానివ్వండి..రాజకీయపరంగా కానివ్వండి.

అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా సరే వర్మకి భయం లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తాడు. అస్సలు ఆలోచించుకోరు. ఓపెన్‌గా వర్మ వెళ్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలా ఆయన తనకు అవసరం లేని ఎన్నో విషయాలో కలుగచేసుకుని ట్వీట్ చేసి తిట్టించుకున్న సంధర్భాలు ఉన్నాయి. ఇక వర్మ పెట్టే ట్వీట్లకు ఆయనకు ఫీలింగ్స్ లేవంటూ కొందరు నెటిజెన్స్ నెట్టింట ఆయనను ట్రోల్ కూడా చేశారు. కానీ వర్మ అవి ఏం పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా పెట్టిన ఒక పోస్ట్ తో వాళ్ళకి చెప్పకనే సమాధనం ఇచ్చేశాడు వర్మ.

తనకిష్టమైన వాళ్ళ ఫొటోలు, వీడియోలు, ఎంజాయ్ మూమెంట్స్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడం వర్మ స్టైల్. ఈ క్రమంలోనే ఓ కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ వర్మ నాకు కూడా ఫీలింగ్స్‌ ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఛార్మితో డ్రింక్ పార్టి చేసుకుంటున్నట్లు కనిపించే ఓ ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఛార్మి డ్రింక్ గ్లాస్ పట్టుకుని ఫొటోకి ఫోజు ఇవ్వడంతో జనాలు మరింత ఆశ్చర్యపోతున్నారు. గతంలో వీళ్ల మధ్య ఏదో కిచ్ కిచ్ మ్యాటర్ నడించిందని అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్లు ఇలా కలుసుకోవడం..ఆ ఫోటలని ఇలా పబ్లిక్ ప్లాట్ ఫాంలో షేర్ చేయడంతో ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కాగా దీని పై నెటిజన్స్ మాత్రం..భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. లైఫ్ అంటె నిదే వర్మ..పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నవ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.