ఇప్పటి వరకు ఎన్టీఆర్ గురించి ఏ నటుడు ఇలా చెప్పి ఉండరు.. ఛత్రపతి శేఖర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్ నచ్చి మెచ్చే వాళ్ళు కొందరు అయితే,,అయన మనస్తత్త్వం..స్వభావం..బీహేవియర్ నచ్చి అభిమానించే వారు మరికొందరు. ఆ లిస్ట్ లోకే వస్తారు ఈ ఛత్రపతి శేఖర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే అన్ని సినిమాల్లో ఏదైన ఓ కీలక రోల్ లో కనిపిస్తుంటాడు. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, RRR..ఇలా అన్ని సినిమాల్లో కనిపించి..నటించి..తన నటన తో అభిమానులని మెప్పించాడు.

ఛత్రపతి సినిమాలో తనకు ఇచ్చిన పాత్ర చిన్నదే అయినా దాని పైన తనదైన ముద్ర వేయగలిగారు.. ఆ సినిమా అందించిన విజయంతో..ఆ సినిమా తెచ్చి పెట్టిన గుర్తింపుతో చత్రపతి శేఖర్ గా మారిపోయారు. రీసెంట్ గాRRRలో కీలక రోల్ ప్లే చేసిన ఈ ఛత్రపతి శేఖర్.. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో తన గురించి బోలెడు విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు తారక్ గురించి మాట్లాడుతూ ..ఆయన వ్యక్తిత్త్వం గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ..” రాజమౌళిని ఏ నాడు హెల్ప్ చేయమని అడగలేదు అని..ఆయనే నా లోని టాలెంట్ చూసి ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ లో జక్కన్న మంచి రోల్ ఇచ్చారని సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో తారక్ అలియా తో నీ రాముడిని తీసుకొస్తాను అమ్మ అని చెప్పే సీన్ నాకు బాగా నచ్చిందని..కళ్లల్లో నీళు వచ్చాయమి చెప్పుకొచ్చారు. ఇక తారక్ గురించి మాట్లాడుతూ..”ఆయన ఓ గొప్ప నటుడని.. చాలా మంచి మనిషి అని చెప్పుతూ.. తారక్ లో ఒక్క గొప్ప గుణం ఉందని..ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా..వాళ్ళు బాగా నటిస్తే దగ్గరకు వచ్చి అభినందిస్తారని..అలాంటి గొప్ప నటుడు మన ఇండస్ట్రీలో ఉండటం మనకే గర్వ కారణం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ..”శక్తి సినిమా షూటింగ్ టైలో నాకు యాక్సిడేఅంట్ అయ్యిందని..అప్పుడు తారక్ నన్ను బాగా తిట్టారని..నువ్వు కంపెనీ వెహికల్ వాడచ్చు కదా.. పరసనల్ ది ఎందుకు వాడుతున్నావ్..జాగ్రత్త గా ఉండాలి..” అంటూ అరిచారు అని చెప్పుకొచ్చారు. దీంతో ఛత్రపతి శేఖర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.