బన్నీ పక్కన డాన్స్ చేసే ఛాన్స్ వస్తే.. బాలీవుడ్ బ్యూటీ ఆ కండిషన్లు పెట్టిందట..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ఐకానిక్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ ఉండేవాడు. అయితే ఇక ఇండస్ట్రీలోకి ఏదైనా కొత్త స్టైల్ తీసుకు రావాలన్నారు. సరికొత్త లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించాలన్న అది కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే ఆ రికార్డు సొంతం అయ్యింది అని చెప్పాలి. అంతేకాదు మిగతా హీరోల కంటే కాస్త భిన్నంగా ఎంతో స్టైల్గా డ్యాన్సులు చేస్తూఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే చాలు ఇక ఈ సినిమాలో డాన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకుంటారు.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ టాలీవుడ్ లో నెంబర్ వన్ డాన్సర్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.ఇకపోతే ఇటీవలే పుష్ప అనే పాన్ ఇండియా మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు వారి అబ్బాయి. కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఈ సినిమాలో బన్నీ డాన్స్ వేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ ఐటెం సాంగులలో బన్నీ వేసే స్టెప్పులు కూడా ఎంతో హాపీ గా మారిపోయాయి. దీంతో ఇక డాన్స్ కావాలని కోరుకునే ప్రేక్షకులు అందరూ కూడా సంతృప్తి చెందారు అని చెప్పాలి.

పుష్ప సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు పార్ట్ 2 తీయాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడు. ఇక పుష్ప పార్ట్ 2 కోసం సుకుమార్ ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 2 లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నీ తీసుకోవాలని అనుకుంటున్నాడట సుక్కు. ఇక ఇలా చేయడం వల్ల అటు బాలీవుడ్ లో కూడా పుష్ప పార్ట్ 2 పై అంచనాలు పెరిగిపోతాయనీ ప్లాన్ వేసాడట. కానీ ఇక ఈ హాట్ బ్యూటీ కి బన్నీ పక్కన డాన్స్ చేసే అవకాశం వస్తే కొన్ని కండిషన్లు పెట్టి చివరికి పరువు తీసుకుందట. ఒక పాటలో నటించినందుకు గాను 4 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. అయితే బాలీవుడ్ లో ఇది చిన్నది అయిన.. తెలుగు డైరెక్టర్ ల కు మాత్రమే పెద్దది అని చెప్పాలి..