RRR కోసం ఎన్టీఆర్ ఎన్ని రోజులు డబ్బింగ్ చెప్పారో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఏం చేసినా సంచలనమే. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తారక్ కి. ఎప్పుడు సరదాగా నవ్వుతూ..నవ్విస్తూ..ఉంటాడు ఈ నందమూరి వారసుడు. ఆ సంగతి మనకు ఎప్పుడో తెలిసినా.. రీసెంట్ గా RRR ప్రమోషన్స్ లో మరోసారీ ప్రూవ్ చేశాడు తారక్. మీరు గమనించిన్నట్లైతే సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిన అన్నీ ఇంటర్వ్యులల్లో తారక్ నే హైలెట్ గా నిలిచారు. చరణ్-రాజమౌళి పక్కన ఉన్నా కానీ అందరి కళ్ళు తారక్ పైనే ఉన్నాయి. అంతలా తన మాటలతో అట్రాక్ట్ చేసేస్తాడు NTR.

మరికొన్ని గంటల్లో తారక్-చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రణం రౌద్రం రుధిరం” విడుదల కాబోతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం భారీ సంఖ్యలో అభిమానులతో పాటు..బడా బడా సెలబ్రిటీస్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరబాద్ లో టికెట్లని బుక్ అయిపోయాయి. టికెట్ రేటు భారీగా పెంచినా..అభిమానులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పోటీ పడి మరి సినిమా ను చూడటానికి రెడి అవుతున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా అసలు రిజల్ట్ తేలబోతుంది.

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ పలు ఇంటర్య్వులకు అటెండ్ అయ్యిన్నప్పుడు ఆయనకి చాలా రకాల ప్రశ్నలు ఎదురైయాయి.ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేశాడు తారక్. ఈ సినిమా కోసం ఆయన డబ్బింగ్ చెప్పడానికి ఎన్ని రోజులు తీసుకున్నారో తెలుసా..జస్ట్ గెస్ చేయండి..చూద్దాం.

అసలు ఎవ్వరు ఊహించలేరు. అంత త్వరగా తన డబ్బింగ్ పనులను పూర్తి చేశాడు తారక్. ఈ సినిమాలో డైలాగ్ వర్షన్ చాలా తక్కువని ..ఎన్టీఆర్ తన తెలుగు డబ్బింగ్ పూర్తి చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పట్టిందని ఇంటర్వ్యుల్లో చెప్పారు. అలాగే హిందీ వర్షెన్ కి రెండు రోజులు, తమిళ్ డబ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నాడట తారక్. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.