ప్రభాస్‌ పెళ్లి విషయం లో జరిగేది ఇదే.. తేల్చి చెప్పేన జ్యోతిష్యుడు..!!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికి టక్కున గుర్తు వచ్చే కటౌట్..ప్రభాస్ ది. ఆయన తోటి వయసు గల హీరోలందరూ పెళ్లి చేసేసుకుని..ఇద్దరేసి పిల్లల్ని కనేశారు. కానీ, మన డార్లింగ్ మాత్రం పెళ్లి ఊసేలేదు. పోనీ నేను చేసుకోను అని చెప్తున్నాడా..? లేదే. అలా అని నేను పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పడం లేదు. అసలు పెళ్లి పై ప్రభాస్ మనసులో ఏమి ఉందో ఎవ్వరికి అర్ధంకావడం లేదు.

అప్పుడెప్పుడో బాహుబలి ప్రమోషన్స్ లో చెప్పాడు ..పెళ్లి చేసుకుంటా అని.. ఇప్పటి వరకు మళ్ళీ ఆ ప్రస్తావన నే తీసుకురాలేదు. కాగా, స్టార్ హీరోయిన్ అనుష్క తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని..అనుష్కకి కూడా ప్రభాస్ అంటే ఇష్టమని..గత కొన్ని సంవత్సరాల నుండి మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి..వాళ్లు ఎప్పటికప్పుడు మేం ఫ్రెండ్స్ అంతే అంటూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మరో వైపు కుటుంబ సభ్యులు మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని .. సమయం వచ్చినప్పుడు ఆ విషయం మేమే చెప్తాం అంటూ..ఇంటర్వ్యులల్లో చెప్పుతున్నారు .

అయితే రీసెంట్ గా ప్రభాస్ పెళ్ళి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కి ఈ ఏడాది లోనే పెళ్లి జరగబోతుందని కుండబద్ధలు కొట్టిన్నట్లు చెప్పేశాడు. ఆయన జాతకం చూసిన తరువాతనే ఈ విషయం చెప్పుతున్నారట. అక్టోబర్‌ 2022 నుంచి అక్టోబర్‌ 2023 మధ్యలో ప్రభాస్ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చని..ఎట్టి పరిస్ధితిలోను ఇది జరగకుండా ఉండే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్ గా మా హీరో పెళ్లి జరిగితే చాలు అంటున్నారు. మరి చూడాలి ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు ప్రభాస్‌ వివాహం జరుగుతుందా ? లేదా ? అనేది. కాగా ప్రభాస్ హీరో గా నటించిన రాధ్యే శ్యామ్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.