సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా తన కెరియర్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అభిమానులలో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది కానీ నటుడిగా మాత్రం ఎదగలేక పోయింది . కానీ ఇటీవల గ్లామర్ హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక అంతే కాదు తన కూతురు సుప్రీత తో కలిసి ఈమె చేసే వైరల్ వీడియోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
తల్లి కూతురు ఇద్దరు కలిసి చేసే డాన్స్ కూడా ప్రేక్షకులను మరింత ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. ఇకపోతే తల్లీకూతుళ్లను చూస్తే ఎవరైనా సరే అక్క చెల్లెల అని అనకు మారరు. సురేఖ వాణి కూడా కూతురు అందంతో పోటీపడుతూ ఎప్పటికప్పుడు మరింత గ్లామర్ ను పెంచుతూ వస్తోంది. సుప్రీత ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం కాలేదు కానీ తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను సంపాదించుకొని సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
స్టార్ హీరోయిన్ ల తో సమానంగా అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ఇటీవల ఒక మ్యూజిక్ ఆల్బం లో కూడా నటించి మంచి ఆదరణ పొందింది. ఈమె అందానికి పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అని వార్తలు వచ్చినా కానీ సురేఖవాణి మాత్రం వీటిపై స్పందించలేదు. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఎవరో సుప్రీత కు సంబంధించి ఒక ఫేక్ ఫోన్ నెంబర్ క్రియేట్ చేశారు.
అయితే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ ఇది తన నంబర్ కాదని ఎవరూ కూడా ఈ నెంబర్ కి కాల్ చేయవద్దు అని ఎటువంటి ట్రాన్సక్షన్ కూడా చేయవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆ నంబర్ ను స్క్రీన్‌షాట్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా బాగా వైరల్ గా మారింది.