టాలీవుడ్ ని ఏకిపారేసిన రాశీ ఖన్నా..వామ్మో.. అంతా మాట అనేసిందేంటి..!

రాశీ ఖన్నా..పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో నటించి మెప్పించింది. నాగశౌర్య హీరో గా నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బొద్దుగుమ్మా..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ది టైం అన్నీ సినిమాలో అందంతో నే నెట్టుకొచ్చిన ఈ భామా..వరుణ్ తేజ్ తో నటించిన తొలిప్రేమ సినిమాలో మాత్రం ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని ఫిదా చేసింది.

తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ అమ్మడు అటు కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను ఒక్కేసారి నటించి.. కొంత డిమాండ్ తగ్గించుకుంది. పైగా చూస్ చేసుకునే స్టోరీల్లో పెద్ద గా కంటెంట్ కూడా లేకపోవడంతో అమ్మడు సినిమా లు ఫ్లాప్ అయ్యాయి. దీంతీ కోలీవుడ్ చెక్కేసిన ఈ భామ అక్కడ మాత్రం మంచి పేరే తెచ్చుకుంది. కోలీవుడ్ లో ఎంటర్ అవ్వగానే బడా బడా స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీ..ఇక ఈసారి బాలీవుడ్ లో పాగా వేద్దామని కోలీవుడ్ టూ బాలీవుడ్ యూటర్న తీసుకుని.. జీరో సైజ్ కి వచ్చి అజయ్ దేవగణ్ సరసన రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సినిమా లో అమ్మడు పర్ ఫామెన్స్ టూ గుడ్. ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో..పిచ్చి పట్టిన ఓ అమ్మాయిలా..సైకో లా మారి..సిరీస్ తో మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఈ సీరిస్ రాశీకి మంచి ప్రశంసలు తెచ్చిపెడుతుంది. దీంతో అమ్మడికి హిందీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ఇక ఈ టైంలోనే రాశి తెలుగు ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..”సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టాకా..నాకు రొటీన్ ఫార్ములా అలవాటు అయ్యిందని..అలా ఉండడం నాకు ఇష్టం ఉండదని చెప్పుతూ.. కమర్షియల్ సినిమాలలో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించి.. తర్వాత పక్కకు వెళ్లిపోవడం ఇదే రొటీన్ ఫార్ములాను టాలీవుడ్ క్రియేట్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో టాలెంట్ చూడకుండా..అందం రంగు ని బట్టి అవకాశాలు ఇస్తారు. అలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇక నుంచి నా కథల ఎంపికలో కొత్తదనం ఉంటుంది.. ప్రతి సినిమాలో ఒక కొత్త నన్ను చూస్తారు”..అంటూ సంచలన వ్యాఖలు చేసింది. దీంతో పలువురు నెటిజన్లు అమ్మడిని తిట్టిపోస్తున్నారు. నీకి తల పొగరు..నీకు ఇమతటి హీరోయిన్ పేరు తెచ్చిపెట్టింది తెలుగు సినిమాలే అంటూ ఆమె పై మండిపడుతున్నారు

Share post:

Popular