ప్రభాస్‌ అలాంటి వాడే..తెర పై కొత్త బాంబ్ పేల్చిన నటి..!!

ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు..అమ్మాయిల కలల రాకుమారుడు. ఆ కటౌట్ చూసి పడిపోని గర్ల్స్ ఉంటారా..నో ఛాన్స్. అందం విషయంలోనే కాదు..అంతకుమించిన మంచి మనసు. ఈ మాట ఆయన తో పని చేసే వాలే ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. అంత స్టార్ స్టేటస్ కలిగి ఉన్నా..ఎంతో సింపుల్ గా ఉండటం ఆయనను చూసే నేర్చుకోవాలి అంటారు ఆయన అభిమానులు. బాహుబలి సినిమా తరువాత ఆయన రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ప్రభాస్ పేరు చెప్పితే జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన రాధే శ్యామ్ మూవి..రిలీజై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నా..కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీని బట్టి ఆయనకి జనాల్లో ఉండే ఫాలోయింగ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. బడా బడా స్టార్స్ కూడా ఈయన సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజాగా నటి పూనమ్‌ కౌర్‌ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఓ రేంజ్ లో పొగిడేసింది. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో ఆమె తరచూ అవసరమున్నా లేకున్నా ఏదో ఒక్క విషయం మాట్లాడి వార్తల్లో నిలుస్తోంది. పబ్లిసిటీ పెంచుకోడానికి ఇలా చేస్తుందో..లేక పాపులర్ అయిన వ్యక్తుల గురించి మాట్లాడితే ఆమె పాపులర్ అవుతుంది అని అనుకున్నిందో తెలియదు కానీ.. ఈ మధ్య ఎక్కువుగా సినీ ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ తాజాగా ‘నాతి చరామి’ మూవీతో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో పూనమ్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ..”సినీ ఇండస్ట్రీలో ప్రభాస్‌ లాంటి వ్యక్తి ఎవరూ లేరు అని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు కానీ ప్రభాస్ లా ఎవ్వరు చేయలేరు అని.. ఒక మనిషిని నమ్మి ఐదు సంవత్సరాలు తన జీవితాని వాళ్ల చేతిలో పెట్టడం.. ఒకే మూవీకి కేటాయించడం..నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ అందగాడు, లుక్స్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెడితే.. ప్రభాస్ తను నమ్మిన వాళ్ల కోసం ఏమైన చేస్తాడు..చేయగలడు.. అది ఆయన క్యారెక్టర్” అంటూ ప్రశంసలు కురిపించింది పూనమ్‌.