అంతా ఊహించిందే జరిగిందిగా..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నయన్‌, విఘ్నేశ్‌..?

నయనతార..అందానికి అందం..నటనకి నటన..హీరోలకి ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్న ఈ అమ్మడు.. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన సంగతి తెలిసిందే. లవ్ అంటూ కొంత కాలం తిరిగి..ఆ తరువాత బాండింగ్ కుదరడం లేదంటూ..టాటా బైబై చెప్పేసింది. అబ్బో..లవ్ పేరుతో ఈ అమ్మడు చేసిన పనులు అప్పట్లో పెద్ద దుమారానే లేపాయి.

అయితే, గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్ తో ప్రేమ లో ఉందని..అంతేకాదు నిశ్చితార్ధం కూడా అయిపోయిందని..ఆ మధ్య ఓ రింగ్ పెట్టుకున్న ఫోటో పోస్ట్ చేసి..అఫిషియల్ గా ప్రకటించకపోయినా..అందరికి అర్ధం అయ్యేలా మ్యాటర్ ని లీక్ చేసింది. దీంతో నయనతారని పెళ్లి కూతురుగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న వేళ..షాకింగ్ న్యూస్ బయటకివచ్చింది.

గత కొన్ని నెలలుగా నయన్‌, విఘ్నేశ్‌ సమయం ఉన్నప్పుడల్లా..ఎక్కువుగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి నయన్‌, విఘ్నేశ్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలన్ని చూట్టేస్తున్నారు. కాగా తాజాగా వీళ్లిద్దరు తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లారు. ఇక సెలబ్రిటీలు కనపడగానే మన వాళ్ళు ఆగుతారా..అందులోను నయనతార..ఇంకేముంది కెమారాలు తీసుకుని ఫోట్లో క్లిక్ మనిపించారు. ఆమెతో సెల్ఫీలు..అంటూ పై పై పడ్డారు. దీంతో అక్కడ కొంచెంసేపు గందరగోల పరిస్ధితి నెలకొంది. అయితే ఈ వీడియోలో నయన్ వివాహమైన స్తీలా నుదుటిన బొట్టు పెట్టుకుని కనిపించింది. దీంతో నయన్‌, విఘ్నేశ్‌ ల పెళ్ళి అయిపోయిందని..నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోందరు అయితే చెప్పకుండానే పెళ్లి చేసుకున్న అమ్మడు..రేపో మాపో నా బిడ్డ అంటూ మీడియా ముందుకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి నాయన్ ఇలాంటి వార్తల పై ఎలా రియాక్ట్ అవుతుందో..!!

Share post:

Popular