షూటింగ్ స్పాట్‌లోనే డిస్కో శాంతి చేసిన ప‌నికి షాక్ అయిన ఏఎన్నార్‌..!

రియల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి భార్య డిస్కోశాంతి అప్పట్లో ఇండస్ట్రీలో ఎంతలా గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులందరూ నీ కూడా ఉర్రూతలూగించింది డిస్కోశాంతి. ఈ క్రమంలోనే డిస్కో శాంతి కెరీర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. అనగనగా అది 1992.. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ బుల్లోడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో డిస్కోశాంతి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. రాగింగ్ ఆట రాగా లాట అని ఈ సాంగ్ సాగుతూ ఉంటుంది.

సరిగ్గా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు షాక్ అయ్యారట. ఏకంగా అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక స్టూడెంట్ ని అక్కినేని నాగేశ్వరరావు ముందే డిస్కోశాంతి చితక్కొట్టిందట. ఇక ఇలా ఎందుకు కొట్టింది అన్న విషయం తెలియక అక్కినేని నాగేశ్వరావు మాత్రమే కాదు అక్కడున్న మిగతా చిత్రబృందం కూడా షాక్ అయ్యారట. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐటెం సాంగ్ చేస్తున్నప్పుడు డిస్కోశాంతి కెమెరా ని చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు.

ఇంతలో అక్కడున్న ఒక కుర్రాడు కెమెరా పక్కకి వచ్చి నిలబడి డిస్కో శాంతిని చూస్తూ నవ్వాడు. ఇక ఆ తర్వాత కెమెరా నుంచి ఆమె చూపు ఆ కుర్రాడి వైపు మళ్ళింది. ఎవరు అతను నన్ను చూసి నవ్వుతున్నాడు అంటూ మనసులో అనుకుంది డిస్కోశాంతి. కేవలం నవ్వడమే కాదు ఆ తర్వాత కాస్త మితి మీరి ప్రవర్తించడం కూడా చేస్తాడు సదరు కుర్రాడు. అసభ్యకరంగా సైగ చేశాడు. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఓర్పు వహిస్తూ వచ్చిన డిస్కో శాంతి ఒకవైపు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ కుర్రాడిని దగ్గరికి రమ్మని పిలిచింది.. ఇక అతను దగ్గరికి రాగానే కాలితో తన్నింది. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం మొదలు పెట్టింది.

ఇక అక్కడే ఉన్న అక్కినేని నాగేశ్వరరావు, చిత్రబృందం కూడా ఏం జరుగుతుందో అర్థం కాక కాస్త సతమతమయ్యారు. నోటికి వచ్చిన అన్ని బూతులు తిడుతూ ఆ అబ్బాయిని కొట్టడంతో ఈ అమ్మాయి ఇలా కొడుతుంది ఏంటి అంటూ అక్కినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక చిత్రబృందం వెళ్లి ఆపడంతో చివరికి ఆ అబ్బాయి తప్పించుకుని పారిపోయాడట. ఇక మరుసటి రోజు షూటింగ్లో శాంతిని పిలిచారట అక్కినేని. ఎందుకమ్మా వాడిని అట్లా కొట్టావ్ అంటూ అడగడంతో ఆ అబ్బాయి నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని శాంతి చెప్పడంతో.. ఏదేమైనా అలా కొట్టడం తప్పు కదా.. తగలరాని చోట తాగితే వాడు చనిపోతే జైలుకు వెళ్తావ్ కదా అంటూ చెప్పారట. అక్కినేని చెప్పడంతో ఏమీ తెలియనట్లుగా శాంతి సరే అంటూ చెప్పారట.