అబ్బా..పవన్ తో మంచు విష్ణు ఫైట్..మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే..?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ మధ్య కాలంలో అయితే రాజకీయ నాయకులను మించి పోయారు మన హీరోలు. స్పాట్ లోనే మాట మార్చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోలు బోలెడు మంది ఉన్నారు. ఇక అలాంటి వారిని మన నెటిజన్లు ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ కి సంబంధించి ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. కొందరు అయితే శృతి మించిన పదాలు వాడుతూ…వాళ్ళ ఫ్యామిలి మనోభావలను దెబ్బ తీస్తున్నారు. కొంతవరకు కంట్రోల్ చేసుకున్న మోహన్ బాబు.. ఇక విసుగుచెంది..హద్దలు దాటితే..పరువు నష్టం దావా వేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొంతమేర భయపడిన జనాలు. ఓ అడుగు వెనక్కి వేసి ఆయన విషయంలో ట్రోలింగ్ తగ్గించారు.

అయితే మొదటి నుండి ఇండస్ట్రీలో ఓ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి లోలోపల ఇన్నర్ ఫైట్ జరుగుతుందని. బయటకి బాగానే మాట్లాడుకుంటున్నా..మీడియా సమావేశాలల్లో అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటారు పెద్ద మనుషులు. అయితే ఈ గోడవలు నిజం అంటూ వాళ్ళ మధ్య సినిమా పెద్దల ఫైట్ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాల వల్లే మంచు విష్ణు..పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం వదులుకున్నాడట.

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ రఫ్ఫాడించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించి ఫుల్ ఆకలి మీద ఉన్న అభిమానుల ఆకలి తీర్చాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా హీరోకు తగ్గట్లే ఉంటుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా చాలా మంది హీరోలను అనుకున్నారట డైరెక్టర్. ఈ క్రమంలోనే మంచు విష్ణు ని విలన్ గా పెడితే బాగుంటాది అని…సినిమాకి అదనపు హైప్ వస్తుందని అనుకున్నారట. కానీ ఈ సినిమాని మంచు విష్ణు రిజెక్ట్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ తో నటించడం ఇష్టం లేకనే ఆయన ఈ ఆఫర్ ను వదులుకున్నాడని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాగా కొందరు పవన్ అభిమానులు ..విష్ణు కి అంత సీన్ లేదు..పవన్ తో నటించే దమ్ము లేకనే వదులుకోని ఉంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి కొందరు అయితే.. డానియల్ శేఖర్ పాత్రలో రానా కాకుండా మరెవరు చేసిన అది ఫ్లాప్ అయ్యుండేది అంటూ వాళ్ళకు తోచిన ఆన్సర్స్ ఇస్తున్నారు.