అల్లు అర్జున్‌ VS నాగ చైత‌న్య‌..అయ్యయ్యయో ఎంత పని చేసావు సమంతా..?

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ నే ఉంది. ఫోన్లు చేసుకుని హాయ్ బాయ్ చెప్పుకునే అంత స్నేహం లేకపోయినా..ఏ ఫంక్షన్ లో నైన కనిపించిన్నప్పుడు మాత్రం చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. అయితే పుష్ప సినిమా షూటింగ్ వరకు బాగానే ఉన్న వీళ్ళ ఫ్రెండ్ షిప్ ఆ తరువాత బెడిసికొట్టిన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య మాజీ భార్య సమంతతో అల్లు అర్జున ఊ అంటావా మావా అంటూ హాట్ ఐటెం సాంగ్ కి రెచ్చిపోయి మరీ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అప్పటికే సమంత చై తో విడాకులు తీసుకుంటున్నా అని ప్రకటించినా..అఫిషియల్ గా అయితే డివర్స్ రాలేదు.

ఈ క్రమంలో అలా ఆమె తో హాట్ పర్ ఫామెన్స్ లు ఇవ్వడం అక్కినేని అభిమానులకు నచ్చలేదు. ఇక ఆ తరువాత పుష్ప సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ..సమంతను ఓ రేంజ్ లో పొగిడేశాడు. అంతేనా..సమంత ఈ సాంగ్ చేయడం వల్లే సినిమా కి మంచి పేరు వచ్చిందని.. అసలు సమంత ఈ పాటకు ఒప్పించింది తానే అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక అసలు గొడవ అక్కడే స్టార్ట్ అయ్యింది. అక్కినేని VS అల్లు ఫైట్ అన్నట్లు..సమంత ను మధ్యలోకి లాగుతూ నానా రచ్చ చేశారు అభిమానులు. ఆ తరువాత వేడి చల్లారి..పరిస్ధితులు కంట్రోల్ లోకి వచ్చాయి.

అయితే తాజా పరిస్ధితులు చూస్తుంటే మళ్లి గొడవ మొదలైన్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి గట్టి పోటీ గా చైతన్య రంగంలోకి దిగ్గాడు. నేటి కాలంలో హీరోల ట్రెండ్‌ను ఫాలో అవుతూ సినిమాలతో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లోనూ న‌టిస్తున్నారు. ఇక నాగ చైత‌న్య కూడా అప్పుడేప్పుడో స‌మంత‌తో క‌లిసి ఉన్న‌పుడు ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో క‌నిపించి మెప్పించాదు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మ‌రో క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో కనిపించనున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ద స్విగ్గి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. ఆన్‌లైన్‌లో ఫుడ్ యాప్ అయిన స్విగ్గి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో నాగ చైత‌న్య న‌టించారు. స‌ద‌రు యాడ్‌ను త‌న సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు చైత‌న్య‌. అయితే ఈ మధ్యనే స్విగ్గి కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే జోమాటా యాడ్‌లో బ‌న్నీ న‌టించాడు. ఇక ఇప్పుడు స్విగ్గి సంస్థ కోసం నాగ చైత‌న్య‌ను రంగంలోకి దిగడం అందరి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొందరు అయితే చైతన్య కావాలనే బన్నీకి పోటీగా ఇలా స్విగ్గి ని ప్రమోట్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.